»   » మహేష్ బాబు కొత్త చిత్రం ప్రకటన (అఫీషియల్)

మహేష్ బాబు కొత్త చిత్రం ప్రకటన (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నేనొక్కడినే '1' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్‌బాబు. ఈ నెలలోనే 'ఆగడు' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా మరో కొత్త చిత్రం కమిటయ్యారు. మహేష్‌బాబు హీరోగా యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. 2014 జులైలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

మహేష్‌బాబు మాట్లాడుతూ ''యూటీవీ సంస్థతో ఓ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇందిర ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో యు.టి.వి. తెలుగులో నిర్మిస్తున్న తొలిచిత్రంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా వుంది. యు.టి.వి. సంస్థ తెలుగులో గొప్ప విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

యు.టి.వి. దక్షిణాది బిజినెస్-స్టూడియోస్ అధ్యక్షుడు ధనంజయన్ మాట్లాడుతూ 'భారతదేశంలో హిందీ తర్వాత రెండో పెద్ద చిత్ర పరిశ్రమ అయినా తెలుగులో మా ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం ఆనందంగా వుంది. అత్యున్నత ప్రమాణాలతో తెలుగుప్రేక్షకులు గర్వించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాం. తెలుగులో మా సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. మహేష్‌బాబులాంటి హీరో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాలను అలరించే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు ‌.

''నా మూడో చిత్రం మహేష్‌తో చేయడం సంతోషంగా ఉంద''ని దర్శకుడు చెప్పారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.

English summary
UTV Motion Pictures announced its first production in Telugu with superstar Mahesh Babu, to be written and directed by Koratala Siva of Mirchi fame. The film will go on floors in July 2014 and to be presented in association with Indira Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu