»   » కొత్త తలనొప్పి: పవన్‌ 'కల్యాణాల'పై ప్రశ్నిస్తున్నారు

కొత్త తలనొప్పి: పవన్‌ 'కల్యాణాల'పై ప్రశ్నిస్తున్నారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ నేపధ్యంలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పవన్‌కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై మహిళలు ప్రశ్నిస్తున్నారని రాజ్యసభ వి.హనుమంతరావు పేర్కొన్నారు. అదే సమయంలో రాహుల్‌ ఒక పెళ్లి కూడా చేసుకోలేదని అంటున్నారని తెలిపారు. మహిళల్లో ఎంతో సామాజిక చైతన్యం వచ్చిందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళా దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడారు.

  ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని, సమాజంలో ఉండే ఉన్నత వ్యక్తులు, వారి వ్యక్తిత్వం, జీవనం ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రజల్లో వారిపట్ల విశ్వసనీయత ఉండాలని, మహిళలను గౌరవించాలని, నీతి, నిజాయతి ఎంతో ముఖ్యమని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూద్దామని పేర్కొన్నారు.

  ఇక 'రాజకీయం ఎలా ఉండాలి? పేదలకు ఏం చేయాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా వ్యవహరించాలి?' అనే అంశాలపై తన ఆలోచనలకు అనుగుణంగా పవన్ పార్టీ రూపుదిద్దుకుంటోంది. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'రాజకీయాలపై మార్చి రెండో వారంలో మాట్లాడతాను' అని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు... మరో వారంలో ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

  V.H.Hanumantha Rao Comments Over Pawan Kalyan

  ఈనెల 12న లేదా 15న పవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి జాతీయ మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 45 నిమిషాల నుంచి గంటపాటు మాట్లాడేందుకు వీలుగా పవన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఒక హాలు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజున హైదరాబాద్‌కు రావాల్సిందిగా పవన్ అభిమాన సంఘాల ప్రతినిధులకు సమాచారం వెళ్లింది.

  సన్నిహితులు, అభిమానులు పాల్గొనే ఈ సమావేశంలో... వేదికపై మాత్రం పవన్ ఒక్కరే ఉంటారని తెలుస్తోంది. వారందరి సమక్షంలోనే పవన్ తన రాజకీయ పార్టీపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండాలి? ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలి? పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి?.... ఇలాంటి అనేక అంశాలపై తన లక్ష్యాలు, ఆకాంక్షలను పవన్ వివరిస్తారని తెలుస్తోంది.

  అలాగే... పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇప్పటికే అక్షరబద్ధం చేసినట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఈసారికి మొత్తం అన్ని స్థానాల్లో కాకుండా... 9 లోక్‌సభ, 40 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే 'పవన్ పార్టీ' పోటీ చేస్తుందని తెలుస్తోంది.

  మొత్తానికి... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు పార్టీ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ పెడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది అచ్చంగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, బహుశా... మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.

  English summary
  
 Pawan Kalyan claim that he will be announcing his decision to start a new political party and will declare that he will be contesting in the upcoming elections.Apparently the matinee idol is busy fine tuning the ideological moorings of his political outfit.
   
  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more