Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- News
అన్నెం సాయిపై మరో కేసు నమోదు..
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarkaru Vaari Paata: మహేశ్ మూవీకి వైసీపీ ఎంపీ రివ్యూ.. ఆ తేడానే చూపించారంటూ!
ఈ మధ్య కాలంలో వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అదే సమయంలో దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. దీంతో ఈ సినిమాకు హైప్ అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది.

ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ ఎన్నో అంచనాల నడుమ నేడే (మే 12) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్స్, మార్నింగ్ షోలు కూడా పూర్తి అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే, టాక్ మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదనే చెప్పాలి. కొందరు ఈ సినిమాను బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఇది యావరేజ్ అంటున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ వచ్చిన రివ్యూలు కూడా మిక్స్‌డ్‌గానే వచ్చాయి. అయితే, సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం ఇది మంచి ట్రీట్ అంటున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం పెట్ల తీసిన 'సర్కారు వారి పాట' ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. దీంతో అన్ని ప్రాంతాల్లోని థియేటర్లు సూపర్ స్టార్ అభిమానులతో కళకళలాడుతున్నాయి. ఈ మూవీని సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీలు కూడా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వీ విజయసాయి రెడ్డి తాజాగా 'సర్కారు వారి పాట' మూవీపై తన రివ్యూను పోస్ట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఈ సినిమా ఎలా ఉందో చెబుతూ పోస్ట్ చేశారు.
శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!
వైసీపీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో 'సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ''సర్కార్ వారి పాట''. ఈ సినిమా చాలా బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంకులు చూపించే తేడా ఏ విధంగా ఉంటుంది అనే దానిని తెరపై బాగా ఆవిష్కరించారు. మహేశ్ బాబు గారికి ఆల్ ది బెస్ట్' అని ఆయన రాసుకొచ్చారు. దీంతో ఈయన చేసిన ఈ ట్వీట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానుల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. వాళ్లంతా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడిది టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.
టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌గా నటించారు. నదియా, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలను పోషించారు.