»   » నానితో ఎఫైర్ ఉందంటూ హీరోయిన్ సెన్సేషన్ కామెంట్

నానితో ఎఫైర్ ఉందంటూ హీరోయిన్ సెన్సేషన్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నాని, బాలీవుడ్ భామ వాణి కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆహా కళ్యాణం'. తెలుగు-తమిళంలో ద్విబాషా చిత్రంగా ఈచిత్రం విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్ ఉందంటూ....ఇటీవల తమిళ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

సినిమా ప్రమోషన్లో పాల్గొన్న వాణి కపూర్‌ను ఓ రిపోర్టర్ ఈ విషయమై ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? అనే ప్రశ్నకు వాణి కపూర్ స్పందిస్తూ......'అవును నిజమే, నానితో నాకు ఎఫైర్ ఉంది, అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామనే' అంటూ సమాధానం ఇచ్చింది.

 Vaani Kapoor shocking comments on Nani

మరి వాణి కపూర్ ఈ వ్యాఖ్యలు సరదాగా చేసిందో? మరేమోగానీ.......ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న నాని మాత్రం ఇబ్బందుల్లో పడతాననే భయంతో ఆమె వ్యాఖ్యలకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా సైలెంటుగా ఉండి పోయాడు. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ 'ఆహా కళ్యాణం' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ సౌత్ లో నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే.

'ఆహా కళ్యాణం' చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ నెల 21న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్, సంగీతం:ధరణ్ కుమార్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్, నిర్మాతః ఆదిత్య చోప్రా,స్ర్కీన్ ప్లే, హబీబ్ ఫైజల్: దర్శకత్వం: గోకుల్ కృష్ణ.

English summary
Vaani Kapoor shocking comments on Nani. Vani said, 'Yes, me and my hero, Nani are having an affair, and this is quite normal know? Do you think we shouldn't have one?' Shocked by Vani's reaction, Nani looked puzzled as he knows such rumours will affect his recently acquired 'marital' status.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu