»   »  తమిళ చిత్ర సీమలో 'ప్రజారాజ్యం'

తమిళ చిత్ర సీమలో 'ప్రజారాజ్యం'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vadivelu
చిరంజీవి ప్రజారాజ్యం పార్టి పవనాలు తమిళ సినీ పరిశ్రమను సైతం తాకుతున్నాయి. అక్కడ అంతర్గతంగా ఈ విషయం గత నాలుగు రోజులుగా చర్చనీయాంశమయింది. ఇక తాజాగా కమిడియన్ వడివేలు మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ పేదల అభ్యున్నతి గురించి ఆలోచించే మంచి హృదయం ఉన్న వ్యక్తి చిరంజీవి...ఆయన రాజకీయాల్లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది...ఆయన ఆలోచనలు ,నినాదం చాలా ఉత్సాహభరితంగా ఉంది...ఈ గొప్ప సంఘటన జరగటం ఆంధ్రా కే కాదు...తమిళనాడుకు కూడా ఆనందకరం అని అన్నారు. ఈ స్టేట్ మెంట్స్ విన్న వారందరూ అతను త్వరలో ప్రజారాజ్యం పార్టీలో చేరుతాడని అనుకుంటున్నారు. అలాగే మరికొంత మంది తమిళ సినీ ప్రముఖులు కూడా త్వరలో చిరు పార్టీపై తమ అభిప్రాయాలను మీడియా ముందు చెప్పనున్నారని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X