Vakeel Saabగా మారిన నెల్లూరు కుర్రాళ్లు.. ఫైట్ సీన్స్‌తో కేక పెట్టించిన సినిమా పిడుగులు (వీడియో)
సినిమా అంటే పండితుల నుంచి పామరుల వరకు ఎంతో క్రేజ్ ఉంటుంది. సినిమా రంగంలో రాణించాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ ఆ కల కొందరికే సాధ్యమవుతుంది. ఇదంతా పక్కన పెడితే సినిమా రంగంలో రాణిస్తున్న ప్రముఖులను నివ్వెరపాటుకు గురి చేస్తున్న నెల్లూరు కుర్రాళ్లకు సినిమా రంగంపై ఉన్న తపన, వ్యామోహం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వారు చేసే వీడియోలు, ఫైట్ సీన్లు అగ్ర దర్శకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. ఈ నెల్లూరు కుర్రాళ్ల గురించి వివరాల్లోకి వెళితే...

నెల్లూరు కుర్రాళ్ల అద్భుతమైన ప్రతిభతో
గత కొద్దికాలంగా నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు సోషల్ మీడియాలోనే కాకుండా సినీ పరిశ్రమలో అలజడి సృష్టిస్తున్నారు. చూడటానికి చిన్న వయసులో ఉండే అబ్బాయిల ప్రతిభ మాత్రం సినీ పండితులను తలదన్నేలా ఉంటున్నది. వారు రూపొందించిన వీడియోలు మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

సరిలేరు నీకెవ్వరు యాక్షన్ సీన్లతో
2020 ఏడాది ఆరంభంలో విడుదలైన మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఓ ఫైట్‌ను తమదైన రీతిలో కంపోజ్ చేసి వహ్వా.. శభాష్ అనిపించుకొన్నారు. ఈ వీడియో అప్పట్లో విశేషంగా ట్రెండ్ అయింది. ఈ కుర్రాళ్లు ఎవర్రా అనే విధంగా అందరి దృష్టి ఆలోచనలు ఆ అబ్బాయిల బృందం పడింది.
Recommended Video

వకీల్ సాబ్ ఫైట్లను కంపోజ్ చేస్తూ..
పలు రకాల సినిమాలకు సంబంధించిన సీన్లను రీ క్రియేట్ చేస్తూ అలా తమ టాలెంట్‌తో దూసుకెళ్తున్న పిడుగుల్లాంటి పిల్లలు వకీల్ సాబ్ వీడియోతో మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లను అన్నీ కలిపి ధమాకా సృషించారు. ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్‌గా మారింది.
ఆ మూడు సీన్లను మిక్స్ చేసి...
వకీల్ సాబ్ సినిమాలోని ఇంటర్వెల్ సీన్, బాత్రూం ఫైట్, మెట్రో ట్రైన్‌లోని యాక్షన్ సీన్లు అన్నీ కలిపి ఒకే ఫైట్‌ను కంపోజ్ చేశారు. వారి చేసిన ఫైట్ కంపోజ్ అద్బుతంగా ఉంది. ఫైట్‌కు సంబంధించిన టైమింగ్, యాక్షన్, ఎమోషన్స్, స్టంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక తమ ఫైట్ కంపోజ్‌కు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను జోడించి కేక పెట్టించారు.
నెల్లూరు కుర్రాళ్లపై ప్రశంసల వర్షం
ఎలాంటి శిక్షణ లేని నెల్లూరుకు చెందిన యువతీ యువకులు వకీల్ సాబ్ యాక్షన్ సీన్లను రీ క్రియేట్ చేసిన తీరుపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ వీడియోను షేర్ చేసి అభినందించారు. వారి యాక్షన్, టేకింగ్ ఆశ్చర్య కలిగించడమే కాకుండా అభిమానం పెరిగేలా చేస్తున్నాయి. నెల్లూరు కుర్రాళ్ల ప్రతిభ మరో రేంజ్‌కు వెళ్లాలని ఫిల్మీబీట్ కోరుకొంటున్నది. ఈ వీడియో మీరూ చూసి ప్రశంసలు గుప్పించండి..


Click it and Unblock the Notifications











