For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vakeel Saab effect: టక్ జగదీష్ రిలీజ్ వాయిదా.. మా వల్ల కాదు.. చేతులెత్తేసిన డిస్టిబ్యూటర్లు

  |

  ఆంధ్రప్రదేశ్‌లో వకీల్ సాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంపు వ్యవహారం, బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ ప్రీమియర్లపై సర్కార్ ఆంక్షల వివాదం ప్రభావం మిగితా సినిమాలపై ప్రత్యక్షంగా పడుతున్నట్టు కనిపిస్తున్నది. ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ కానున్న నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం టక్ జగదీష్‌‌పై డైరెక్ట్‌గానే పడింది. డిస్టిబ్యూటర్లతో జరిగిన వాదోపవాదనల తర్వాత హీరో నాని, నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. .. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి అసలు కారణాలు ఏమిటంటే..

  ఏపీలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంతో

  ఏపీలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంతో

  టక్ జగదీష్ సినిమా‌పై మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్న హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ తమ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ టికెట్ల రేట్లు పెంపును ప్రభుత్వం అడ్డుకోవడం, కరోనావైరస్ కేసులు పెరిగిపోవడంతో సినిమా రిలీజ్‌పై సందేహాలు ఏర్పడ్డాయి.

  డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో చర్చలు

  డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో చర్చలు

  టాలీవుడ్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో హీరో నాని, నిర్మాతలు, దర్శకులతోపాటు టక్ జగదీష్ టీమ్ ఇటీవల జూమ్ కాల్‌లో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో చర్చించారట. ఈ సందర్భంగా తక్కువ రేట్లకు సినిమాను థియేటర్లలో ప్రదర్శించడం మా వల్ల కాదు. మేము నష్టాలను భరించలేమని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు స్పష్టం చేశారనేది తాజా సమాచారం.

  టికెట్ల రేట్లు పెంపు వివాదం కొలిక్కి వచ్చాకే

  టికెట్ల రేట్లు పెంపు వివాదం కొలిక్కి వచ్చాకే

  అయితే ఎగ్జిబిటర్లను, డిస్టిబ్యూటర్లను నిర్మాతలు సాహు, హారీష్ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారట. అయినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో నాని జోక్యం చేసుకొన్నారని తెలిసింది. టికెట్ల రేట్లు పెంపు వివాదం ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ గురించి ఆలోచిద్దా. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కూడా బయట ప్రతికూలంగా ఉన్నాయని, ఆ తర్వాత రిలీజ్ ఆలోచిద్దాం అని నాని చెప్పినట్టు తెలిసింది.

  నాని సూచనతో టక్ జగదీష్ రిలీజ్ వాయాదా

  నాని సూచనతో టక్ జగదీష్ రిలీజ్ వాయాదా

  దాంతో నాని సూచన మేరకు నిర్మాతలు కూడా రిలీజ్‌ వాయిదా వేయాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. అయితే ఈ రిలీజ్ వాయిదా విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఒకవేళ పరిస్థితులు చక్కబడితే మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తున్నది.

  టక్ జగదీష్‌కు చిన్న బ్రేక్

  ఒక ఫ్యామిలీ మొత్తం, ఇంటిల్లిపాది వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. క్రాక్ నుంచి వకీల్ సాబ్ వరకు సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇండియాలో ఎక్కడా లేని విధంగా సినిమాను సపోర్ట్ చేశారు. తెలుగు వాళ్లను, సినిమాను ఎవ్వరూ విడదీయలేరు. కొత్త రిలీజ్ విషయంలో చిన్న బ్రేక్ తీసుకొంటున్నాం. ఉగాది రోజు థియేట్రికల్ ట్రైలర్ బయటకు రావడం లేదు. అది ఎన్నడు వచ్చినా అదే రోజు ట్రైలర్‌లో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం. ఏప్రిల్ 23 తేదీ నుంచి టక్ జగదీష్ వెనకకు వెళ్తుంది. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ ఉగాది అంటూ నాని వీడియోను రిలీజ్ చేసి విషయాలను, విషెస్‌ను చెప్పారు.

  టక్ జగదీష్‌లో నటీనటులు, సినిమాటోగ్రఫి

  టక్ జగదీష్‌లో నటీనటులు, సినిమాటోగ్రఫి

  నిన్ను కోరి, మజిలీ చిత్రాలను రూపొందించిన శివ నిర్వాణ దర్వకత్వంలో టక్ జగదీష్ తెరకెక్కింది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ చిత్రంలో నానికి సోదరుడిగా జగపతిబాబు నటిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో నాజర్, డేనియల్ బాలాజీ, తిరువుర్, రోహిణి, దేవదర్శిని, నరేష్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు నటించారు.
  మ్యూజిక్: ఎస్ థమన్
  సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ల
  ఎడిటింగ్: ప్రవీన్ పుడి
  బ్యానర్: షైన్ స్ట్రీన్స్

  English summary
  Naturla Star Nani's Tuck Jagadish release postponed worldwide.This movie was set to release on April 23. But Vakeel Saab ticket rate hike row made huge impact on Tuck Jagadish. Distributors and exhibitors not happy with Tuck Jagadish release in this circumstances. So Nani, and producers have taken decision to postpone the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X