»   » ఏది నిజం? ‘టెంపర్’ డైరెక్టర్ మారాడా?

ఏది నిజం? ‘టెంపర్’ డైరెక్టర్ మారాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందించారు. గతంలో వక్కతం వంశీ ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథ అందించారు. అయితే ఆ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇపుడు ‘టెంపర్' మాత్రం సూపర్ డూపర్ హిట్టయింది.

త్వరలో వక్కతం వంశీ దర్శకుడి అవతారం ఎత్తబోతున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...‘టెంపర్ కంటే ముందే ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల అది వాయదా పడింది. కానీ ఆ ప్రాజెక్టు రద్దుకాలేదు. త్వరలోనే దాని గురించి ఎన్టీఆర్ తో మాట్లాడతాను. అతని సమాధానం మీద ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది' అన్నారు.


Vakkantham Vamsi keen to don director's hat

టెంపర్ స్టోరీ రాసే సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే గతంలో నేను ఎన్టీఆర్ కోసం రాసిన రెండు స్టోరీలు పెయిల్ అయ్యాయి. టెంపర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు వక్కతం.


వాస్తవానికి పూరి సార్ వద్ద ఎన్టీఆర్ కోసం కథ ఉంది. కానీ ఎన్టీఆర్ నా స్క్రిప్టు ఎంచుకున్నారు. ఆ స్టోరీనే ‘టెంపర్'గా తెరకెక్కింది. పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నా స్క్రిప్టు ఎంచుకోగానే చాలా నెర్వస్ అయ్యాను. విజయం సాధించాలని చాలా ప్రార్థనలు చేసాను అంటూ వంశీ చెప్పుకొచ్చారు.


వంశీ వ్యాఖ్యలు విన్న వారు....... వాస్తవానికి తను డైరెక్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే అతను ‘టెంపర్' స్టోరీ రాసుకుని ఉంటాడని, అయితే తన క్లోజ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ అడగటంతో కాదనలేక పూరి జగన్నాథ్ డైరెక్షన్ కోసం ఆ స్టోరీ ఇచ్చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎవరు డైరెక్ట్ చేస్తేనేం...ఎన్టీఆర్ కెరీర్లో ‘టెంపర్' రూపంలో భారీ హిట్ పడింది. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ....

English summary
"Even before 'Temper', I was directing a film with Jr. NTR. For some reasons, it got postponed. But the project has not been shelved. I intend to discuss with NTR soon and the fate of the film relies on his reply," Vamsi told.
Please Wait while comments are loading...