»   » ప్రేమికులరోజు ప్రత్యేకం: మహేష్, బన్నీ, ప్రభాస్, మంచు లక్ష్మి..... ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

ప్రేమికులరోజు ప్రత్యేకం: మహేష్, బన్నీ, ప్రభాస్, మంచు లక్ష్మి..... ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

ఫస్ట్ క్రష్.... ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కలిగే భావన. ఒక అమ్మాయి లేదా అబ్బాయిని చూడగానే మనసుకు హాయిగా గుచ్చుకునే ప్రేమ భావన. వారు తమ సొంతం అయితే బావుండే అనే ఒక చిన్న ఆశ. అయితే చాలా మంది జీవితంలో ఈ ఆశ... ఆశగానే మిగిలిపోతుంది. సినిమాల ప్రభావం బాగా ఉండే ఈ జనరేషన్లో చాలా మంది సినిమా హీరోలు, హీరోయిన్ల మీదనే ఇలాంటి ఫస్ట్ క్రష్ ఫీలవుతుంటారు. తెలిసీ తెలియని వయసులో కొందరు తమ క్లాస్ మేట్స్ మీద, స్కూలు టీచర్ల మీద ఫస్ట్ క్రష్ ఫీలవుతారు. సినిమా స్టార్లు కూడా ఇందుకు అతీతులేమీ కాదు. టాలవుడ్ సెలబ్రిటీలు వివిధ సందర్భాల్లో తమ ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించారు. అందుకు సంబంధించిన విశేషాలు ప్రేమికుల రోజు సందర్భంగా మీరోసారి గుర్తు చేసుకుందాం.

 మహేష్ బాబు మొదట మనసు పడ్డది ఎవరిపై అంటే

మహేష్ బాబు మొదట మనసు పడ్డది ఎవరిపై అంటే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నమ్రత కంటే ముందు మహేష్ బాబు జీవితంలో తొలి సారి ఫస్ట్ క్రష్ ఫీలైంది అమెరికన్ నటి డెమి రోజ్ మీదే. కాలేజీ రోజుల్లో మహేష్ బాబు హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాడు. ఆ సమయంలో డెమీ రోజ్ మీద ఫస్ట్ క్రష్ ఫీలయ్యాడట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ విషయం వెల్లడించారు.

 స్నేహారెడ్డి కంటే ముందు బన్నీ మనసు కొల్లగొట్టింది ఎవరంటే...?

స్నేహారెడ్డి కంటే ముందు బన్నీ మనసు కొల్లగొట్టింది ఎవరంటే...?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే స్నేహారెడ్డి కంటే ముందు బన్నీ మనసు కొల్లగొట్టింది అందాల సుందరి ఐశ్వర్యరాయ్.

 తమన్నా అతడిపై...

తమన్నా అతడిపై...

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మీ ఫస్ట్ క్రష్ ఎవరిపై అనే ప్రశ్నకు హీరోయిన్ తమన్నా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన ఫ్రెండ్ బ్రదర్ మీద తనకు ఫస్ట్ క్రష్ కలిగిందని, తరచూ తన ఫ్రెండును కలవడానికి వెళ్లే సమయంలో తనకు ఈ ఫీలింగ్ కలిగిందని, అయితే అతడు మాత్రం తనను పట్టించుకునే వాడు కాదని తమన్నా తెలిపారు.

 మంచు లక్ష్మి ఫస్ట్ క్రష్ అతడిపై...

మంచు లక్ష్మి ఫస్ట్ క్రష్ అతడిపై...

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. నటి మంచు లక్ష్మికి కూడా నాగార్జున అంటే పిచ్చి. తనకు ఫస్ట్ క్రష్ కలిగింది నాగార్జున మీదే అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది మంచు లచ్చక్క.

 ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరిపై అంటే...

ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరిపై అంటే...

టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌కు స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఫస్ట్ క్రష్ కలిగిందట. తాను చెన్నై డాన్ బాస్కో స్కూల్లో చదువుతున్న రోజుల్లో క్లాస్ టీచర్ మీద ఫస్ట్ క్రష్ కలగిందని తెలిపారు. ప్రభాస్ మాత్రమే కాదు... చాలా మంది అబ్బాయిలకు ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి.

 నితిన్ ఫస్ట్ క్రష్

నితిన్ ఫస్ట్ క్రష్

హీరో నితిన్ ఫస్ట్ క్రష్ ఫీలైంది ప్రముఖ నటి శృతి హాసన్ మీదేనంట. గతంలో జరిగిన ఓ ఆడియో లాంచ్ సందర్భంగా నితిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

 రెజీనా ఫస్ట్ క్రష్

రెజీనా ఫస్ట్ క్రష్

తన టీజేజ్ వయసులో పొరుగింటి అబ్బాయిపై ఫస్ట్ క్రష్ ఫీలైనట్లు హీరోయిన్ రెజీనా వెల్లడించారు.

 రానా ఫస్ట్ క్రష్

రానా ఫస్ట్ క్రష్

నేను ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో మా స్కూల్లో కొత్త అమ్మాయి జాయినైంది. ఆమె మాకు సీనియర్ ఆమెను చూడగానే ఫస్ట్ క్రష్ ఫీలింగ్ వచ్చింది. చాలా మంది అబ్బాయిలు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించేవారు.... అని రానా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ మీద తనకు చాలా క్రష్ ఉందంటూ.... హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ సారి ట్విట్టర్ చాట్లో తెలిపారు.

రాజ్ తరుణ్ ఫస్ట్ క్రష్

రాజ్ తరుణ్ ఫస్ట్ క్రష్

సమంత-నాగ చైతన్య పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ స్పందిస్తూ తన ఫస్ట్ క్రష్ సమంత మీద కలిగింది అని చెప్పిన సంగతి తెలిసిందే.

English summary
Do you know our Tollywood celebrities too, were ignored once by their crushes, while they were trying to grab their attention? Yes! It happens with everyone and the stars, we madly idolize, are no exception. No doubt the ones, who ignored them are now regretting it. But, don't you want to know on whom your favorite celebs were crushing on? Check out the slides to get into the details. On a personal note, don't be surprised to find the ever handsome Mahesh Babu and the gorgeous Tamannaah too, in the list, couldn't win their first crush.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu