twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన మీద మనం సింపతీ చూపించుకోవాల్సిన సమయం వచ్చింది: ‘మహర్షి’ సక్సెస్ మీట్లో వంశీ పైడిపల్లి

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్; పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ''నాకు జన్మనిచ్చిన తల్లికి పాదాభివందనాలు. అమ్మా.. చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేశావు. సాఫ్ట్ వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినపుడు నా వెంట ఎవరూ లేరు. ప్రపంచం కూడా నన్ను నమ్మలేదు. నువ్వు ఒక్కదానివే నమ్మావు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటేకారణం నువ్వే అమ్మా. ఈ సినిమా అయిపోయి ఇంటికి వచ్చాక నువ్వు, నాన్న హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికంటే విజయం ఏమీ ఉండదు. నన్ను భరించినందుకు, పెంచినందు థాంక్స్ అమ్మా.'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

    Vamshi Paidipally speech at Maharshi Sucess Meet

    'మహర్షి' సినిమా అంత బాగా రావడానికి కారణం మహేష్ బాబు. ఆయన కథను రిసీవ్ చేసుకున్న విధానం, ప్రతీ పాత్రను ఆయన చేసిన తీరు, వాటికి తగిన విధంగా ఇచ్చిన హావభవాల కారణంగా సినిమా తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయింది. వాటి ఫలితంగానే ఈ రోజు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని తెలిపారు.

    తెలుగు సినిమా ప్రేక్షకులకు, మహేష్ బాబు అభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు ఎలా ఆదరిస్తారో నిరూపించారు. సుమగారు చెప్పినట్లుగా గుండెను చల్లబరిచే సినిమా ఇది. నేను ముందే చెప్పాను ఇది మైండ్‌కు చెప్పే సినిమా కాదు, మనసులకు చెప్పే సినిమా అని. మనసుతో ఈ సినిమా చూశారు, అందుకే మీరు ఇంతగా మాకు ఆనందాన్ని ఇస్తున్నారు. అందరికీ థాంక్సూ సోమచ్.

    అందరూ ఈ సినిమా మేము ఏదో రైతుల గురించి చెప్పామనుకుంటున్నారు. మేము రైతుల గురించి క్వశ్ఛన్ చేయలేదు, ఒక రైతు దూరం అవ్వడం వల్ల ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. రైతు మీద ఏదైనా ఆర్టికల్ వస్తే సింపతీ చూపిస్తున్నాం. కానీ ఆ సింపతీ మన మీద మనం చూపించుకోవాల్సిన సమయం వచ్చింది. అలాంటి ఆలోచనతో తీసిన సినిమా.

    పృథ్వీగారు చెప్పినట్లు ఈ సినిమా చూసిన తర్వాత చాలా మందిలో వ్యవసాయం చేయాలి, వెళ్లి ఒక ఎకరం భూమి కొనుగోలు చేయాలనే ఆలోచన కలుగుతోంది. ఈ సినిమాతో ప్రేక్షకులు మాకు విజయంతో పాటు రెస్పెక్ట్ కూడా ఇచ్చారని వంశీ పైడిపల్లి తెలిపారు.

    English summary
    Vamshi Paidipally speech at Maharshi Sucess Meet . Maharshi directed by Vamshi Paidipally. Starring Superstar Mahesh Babu, Pooja Hegde, Allari NareshBanner : Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PVP Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X