twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ లేకపోతే ఈ సినిమా లేదు!

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''అల్లు అర్జున్‌ పోషించిన పాత్ర కథకు ప్రాణం పోసింది. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. చరణ్‌, బన్నీ ఇద్దరూ కలిసి నా సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. వారు తెరపై చేసే సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది '' అన్నారు 'ఎవడు' దర్శకుడు వంశీ పైడిపల్లి. అలాగే కథ విన్నవెంటనే చిరంజీవిగారు 'ఇది ఓ స్థాయి సినిమా అవుతుంద'న్నారు. ఆ మాట మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. సాంకేతిక నిపుణుల సినిమా ఇది అన్నారు.

    వంశీ పైడిపల్లి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఎవడు'. రామ్‌చరణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటించారు. అమీజాక్సన్‌ మరో హీరోయిన్. అల్లు అర్జున్‌, కాజల్‌ అతిథి పాత్రల్లో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    దిల్ రాజు మాట్లాడుతూ... ''పవన్‌కల్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' విడుదల తేదీని దృష్టిలో ఉంచుకొని 'ఎవడు'ని వాయిదా వేయాలనుకొన్నాం. కానీ 'జంజీర్‌' విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ప్రత్యామ్నాయం లేకపోవడంతో 31న విడుదల చేస్తున్నాం. ఇదివరకు హిందీలో 'లగాన్‌', 'గదర్‌' చిత్రాలు వెంటవెంటనే విడుదలై చరిత్రను సృష్టించాయి. ఆ తరహాలోనే ఈ రెండు చిత్రాలూ విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉంది'' అన్నారు

    అలాగే ''మా సంస్థ నుంచి ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే రూపుదిద్దుకున్నాయి. వాటికి భిన్నంగా వాణిజ్య హంగులతో ఓ చిత్రాన్ని తీయాలనుకొన్నాం. 'ఎవడు'తో అది కుదిరింది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 'మగధీర' విడుదలైన రోజున ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం ఓ చరిత్రను సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

    English summary
    Producer Dil Raju has informed media personnel that ‘Yevadu’ will hit the screens on the 31st of July. There is no change in the release date. Mega Powerstar Ram Charan is the hero in the film. Shruti Haasan and Amy are the heroines. Related Articles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X