»   » 'అత్తారింటికి దారేది' వస్తుందనే కంగారేం లేదు

'అత్తారింటికి దారేది' వస్తుందనే కంగారేం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''మా సినిమా విడుదలైన మరో వారంలో పవన్‌ సినిమా 'అత్తారింటికి దారేది' వస్తుందనే కంగారేం లేదు. నేనూ ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే నేను కూడా పవన్‌ అభిమానినే. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల చేయడం ఇబ్బందేం కాదు. మనకు కావల్సినన్ని థియేటర్లు ఉన్నాయి'' అంటున్నారు వంశీ పైడిపల్లి.

రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన 'ఎవడు' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 31న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకే బేనర్‌లో వరుసగా మూడో సినిమా చేసిన వంశీ శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

నేను పవన్ కల్యాణ్ అభిమానిని. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్లో 'తొలిప్రేమ', 'ఖుషి' సినిమాలు చూసి ఆనందంతో పేపర్లు ఎగరేసినవాణ్ణి. 'గబ్బర్‌సింగ్'ని కూడా అదే థియేటర్లో చూశా. ఇప్పుడు ఆ థియేటర్‌లో 'ఎవడు' చూడబోతున్నా. 'అత్తారింటికి దారేది' రాగానే చూస్తా అని తేల్చి చెప్పారు.

మిగతా విశేషాలు స్లైడ్ షో లో....

ఆ తరవాత 'అత్తారింటికి..' వెళ్తారు.

ఆ తరవాత 'అత్తారింటికి..' వెళ్తారు.

'నాయక్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒక వారం వ్యవధిలోనే విడుదలై.. విజయం సాధించాయి కదా..? అభిమానులు సినిమా చూడ్డానికి ఒక వారం చాలు. తొలి వారం 'ఎవడు' చూస్తారు. ఆ తరవాత 'అత్తారింటికి..' వెళ్తారు. స్టార్ హీరోతో పనిచేయడం ఓ అరుదైన గౌరవం. కథలో ఏదో ఓ బలమైన అంశం నమ్మితేనే ఇలాంటి అవకాశాలొస్తాయి అన్నారు.

ఇది 'ఫేస్-ఆఫ్' కాదు

ఇది 'ఫేస్-ఆఫ్' కాదు

ఇది హాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఫేస్-ఆఫ్' ఇన్‌స్పిరేషన్‌తో తీసిన సినిమా కాదు. వక్కంతం వంశీ, నేను కలిసి ఈ స్క్రిప్టు తయారు చేశాం. చరణ్ ఇమేజ్ ఈ సినిమాకి చాలా ముఖ్యం. ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే కథనూ, ఆయన పాత్రనూ మలిచాం అని క్లారిఫై చేసారు.

చిరంజీవి లాంటి మాస్ అప్పీల్‌...

చిరంజీవి లాంటి మాస్ అప్పీల్‌...

చిరంజీవి లాంటి మాస్ అప్పీల్‌ను రెండో సినిమాతోనే సాధించాడు. 'రచ్చ', 'నాయక్' సినిమాలతో ఆయన మాస్ పొటెన్షియాలిటీ ఏమిటనేది కనిపించింది. తనను తాను చరణ్ ప్రెజెంట్ చేసుకునే విధానం వల్లే ఇది సాధ్యమైంది. చిరంజీవి గారు 149వ సినిమాతో ఆగితే, చరణ్ 150వ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. 'మగధీర'తో తనదైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు.

బన్నీ చిన్న పాత్ర అయినా...

బన్నీ చిన్న పాత్ర అయినా...

బన్నీ లేకపోతే కథకి ఇంత ఇంపాక్ట్ వచ్చేది కాదు. చిన్న పాత్రయినా సినిమా మొత్తం ఆయన ప్రెజెన్స్ కనిపిస్తుంటుంది. చరణ్, బన్నీ మధ్య సన్నివేశాలున్నాయి. నా సినిమాల్లో హీరోయిన్లు కేవలం బొమ్మలు కాదు. నటించడానికి వారికి స్కోప్ ఉంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, అమీ జాక్సన్ ముగ్గురివీ నటించడానికి అవకాశమున్న పాత్రలే.

సాయికుమార్ కళ్లు మాట్లాడుతాయి

సాయికుమార్ కళ్లు మాట్లాడుతాయి

సాయికుమార్ ప్రధాన విలన్‌గా ఎవడు సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. మామాలూగా ఆయన నోరు మాట్లాడుతుందని తెలుసు. కానీ ఈ సినిమాలో ఆయన కళ్లు మాట్లాడతాయి.

చిరంజీవిలా అదరకొట్టే డాన్స్

చిరంజీవిలా అదరకొట్టే డాన్స్

చరణ్ డాన్సులు అమేజింగ్. 'గ్యాంగ్‌లీడర్'లోని 'చిక్‌చిక్ చేలమ్' పాటలో చిరంజీవి ఎట్లా డాన్స్ చేశారో ఆ స్థాయిలో 'ఫ్రీడమ్' పాటలో అతను చేసిన డాన్స్ మూవ్‌మెంట్స్ చూడాల్సిందే. జానీ గొప్పగా కొరియోగ్రఫీ చేశాడు అని అన్నారు.

ఇద్దరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఈ కథ చెప్పా

ఇద్దరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఈ కథ చెప్పా

''ఎవడు పూర్తిగా వాణిజ్య అంశాలతో మేళవించిన సినిమా. పూర్తిగా రామ్‌చరణ్‌ శైలి, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాం. చరణ్‌ ఇమేజ్‌ ఈ కథకు ప్రధాన బలం.కథ, కథనాలు పూర్తిగా కొత్తగా ఉంటాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇద్దరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఈ కథ చెప్పా. వినగానే నచ్చేసింది. సినిమా చూసిన తరవాత పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. 'చెప్పిన దానికంటే బాగా తీశావ్‌' అని చిరు మెచ్చుకొన్నారు.

 హై కమర్షియల్ ఫిల్మ్

హై కమర్షియల్ ఫిల్మ్

ఇది వెరీ హై కమర్షియల్ ఫిల్మ్. సినిమా పట్ల నిర్మాత రాజు, చరణ్, చిరంజీవి గారు బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కచ్చితంగా పెద్ద హిట్టవు తుందనీ, మంచి జ్ఞాపకాలనెన్నింటినో ఇస్తుందనీ నమ్ముతున్నా. సినిమా అనేది నమ్మకంతో ముడిపడి ఉంటుంది. దర్శకుడిని కథానాయకుడు నమ్మాలి. మా ఇద్దరినీ నిర్మాత నమ్మాలి. మా ముగ్గురి నమ్మకమే సినిమా.

నెక్ట్స్ మహేష్ బాబుతో ...

నెక్ట్స్ మహేష్ బాబుతో ...

కథలో ఏదో ఓ బలమైన అంశం నమ్మితేనే ఇలాంటి అవకాశాలొస్తాయి. త్వరలో మహేష్‌బాబుతో ఓ సినిమా ఉంటుంది. ప్రస్తుతం 'ఎవడు' ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆ తరవాతే కొత్త సినిమా సంగతి చెబుతా.

English summary

 Director Vamsi Paidipalli Says that he is very much confident on his latest Yevadu Film. He confirmed that his next is with Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu