»   » యంగ్ ఇండియా కోసం వందనం అభివందనం...?

యంగ్ ఇండియా కోసం వందనం అభివందనం...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ప్రేమాభిషేకం" అనగానే అందరికీ గుర్తుకొచ్చే పాట 'వందనం అభివందనం.."అక్కినేని నటన, చక్రవర్తి స్వరరచన, దాసరి సాహిత్యం ఆ పాటను ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా విరాజిల్లేలా చేశాయి. ఇప్పుడు ఆ పాట మరోసారి యువతను అలరించబోతోంది. చాలా విరామం తర్వాత డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతోన్న 'యంగ్ ఇండియా" చిత్రంలో ఆ పాటను రీమిక్స్ చేసి వాడుతున్నారు.

ఇప్పుడు ప్రముఖ రచయిత శివశక్తిదత్తా సాహిత్యం అందించిన, ఈ కొత్త హంగుల పాటకు దాసరి నారాయణరావే కొరియోగ్రఫీ చేస్తుండటం విశేషం. బుధవారం ఆర్ ఎఫ్ సీలో ఈ పాట చిత్రీకరణ మొదలైంది. నిర్మాత రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ 'ఓ భారీ సెట్ లో మూడు రోజులు ఈ పాటను చిత్రీకరిస్తున్నాం. అనంతరం ఆ సెట్లోనే మరో పాటను చిత్రీకరిస్తాం ఓ పక్క డబ్బింగ్. మరోపక్క రీ రికార్డింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం" అని తెలిపారు. నూతన తారలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కీరవాణి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X