»   » ఆవిడ కనిపించే నాలుగు సీన్లకి 40 లక్షలా?: అసలు బోయపాటి ఏం చేస్తున్నాడు?

ఆవిడ కనిపించే నాలుగు సీన్లకి 40 లక్షలా?: అసలు బోయపాటి ఏం చేస్తున్నాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శరత్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్ నటీనటులున్న జయ జానకీ నాయక సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఆమె సినిమాల్లోకి రానుండటంతో ఆమె పాత్రపై అందరిలోనూ అసక్తి నెలకొంది కొందరైతే ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా అంటున్నారు.తాజాగా 'జయ జానకి నాయక' సినిమాతో వాణీ విశ్వనాథ్ కూడా రీ ఎంట్రీ ఇచ్చారు.

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా వాణీ విశ్వనాథ్ కి మంచి క్రేజ్ వుంది. అలాంటి ఆమె బోయపాటి శ్రీను సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. పలు భాషల్లో భిన్నమైన చిత్రాల్లో నటించి యాక్షన్‌ హీరోయిన్‌గా పేరొందిన వాణీ విశ్వనాథ్‌ పెళ్ళి తర్వాత నటనకు దాదాపు దూరంగా ఉన్నారు.

Public talk on "Jaya Janaki Nayaka"| Filmibeat Telugu
తెలుగు, తమిళ భాషల్లో కూడా

తెలుగు, తమిళ భాషల్లో కూడా

అడపాదడపా మధ్య మధ్యల్లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవేమీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటివరకు కుటుంబ జీవితానికే ప్రాముఖ్యత ఇచ్చిన వాణీ విశ్వనాథ్‌ తెలుగు, తమిళ భాషల్లో కూడా ముఖ్యపాత్రల్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాణీవిశ్వనాథ్‌ తెలిపింది.

ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు

ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు

జయ జానకి నాయక ముందునుంచి చెబుతున్నట్టుగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. బోయపాటి మాటలను బట్టి క్యాస్టింగ్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ కు మించి ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా అంచనాలను మించి హిట్ అయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టం. చూద్దాం.. ఈ సినిమా ఎంతవరకు డబ్బులు రాబడుతుందో?

నాలుగు సీన్లకే 40 లక్షలు

నాలుగు సీన్లకే 40 లక్షలు

ఆమె కనిపించేది నాలుగు సీన్లే అయినా 40 లక్షలను పారితోషికంగా ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే కథానాయికలతో సమానమైన పారితోషికం ఇచ్చుకోవలసి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రకుల్ .. ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, కేథరిన్ స్పెషల్ సాంగ్ చేసిందనే సంగతి తెలిసిందే.

మలయాళీ ముద్దుగుమ్మ

మలయాళీ ముద్దుగుమ్మ

1990 లలో తెలుగు అగ్ర కథానాయకులెందరితోనో ఆడిపాడిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ, దక్షిణాది భాషా చిత్రాలతో పాటు.. హిందీలోనూ నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రంలో వాణి విశ్వనాథ్ నటిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ అమ్మ పాత్రలో

రకుల్ ప్రీత్ సింగ్ అమ్మ పాత్రలో

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమ్మ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే రమ్యకృష్ణ, మీనా, రోజా, నదియా వంటి తారలు రీఎంట్రీ బ్రహ్మాండంగా సాగిపోతోంది. ఇక వాణి విశ్వనాథ్ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి. ఇప్పటికి టాలీవుడ్ లో అమ్మ, అక్క, వదిన పాత్రల కోసం పాత హీరోయిన్లు బాగానే ఎగబడుతున్నారు. ఆ వరసలోనే ఇప్పుడు వాణీ విశ్వనాథ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూందన్నమాటే చూడాలి ఏం జరగనుందో

English summary
Makers offerd 40 Lacks Remuneration for Vani Vishwanath for Jaya Janaki Nayaka Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu