అయ్యో..! అసలు ఊహించలేం., రకుల్ కే అమ్మ పాత్ర చేస్తోంది
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కుస్తున్న కొత్త సినిమాలో వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్ర తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది
టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన 'ఘరానా మొగుడు'..'కొదమసింహం'..చిత్రాల్లో నటించిన 'వాణీ విశ్వనాథ్' గుర్తుండే ఉంటుంది కదా...తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన ఈ గ్లామర్ తార కొన్నాళ్లుగా చిత్రాలకు దూరంగా ఉండిపోయింది. ఎన్టీఆర్ మొదలుకొని.. 90లలో తెలుగు అగ్ర కథానాయకులెందరితోనో ఆడిపాడిన ఈ మలయాళీ భామ.. దక్షిణాది భాషా చిత్రాలతో పాటు.. హిందీలోనూ నటించింది. అయితే.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన వాణి విశ్వనాథ్.. మళ్లీ ఇప్పుడు తెలుగులో బడా డైరెక్టర్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కుస్తున్న కొత్త సినిమాలో వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్ర చేస్తోందట. ఈ సినిమాలో జగపతి బాబు.. శరత్ కుమార్.. సుమన్ లాంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. బోయపాటి తన ప్రతి సినిమాలోనూ సీనియర్లకు మూడు నాలుగు కీలక పాత్రలు సెట్ చేసి పెడుతుంటాడు.

ఇప్పుడు వాణీని ఏరి కోరి ఈ పాత్రకు ఎంచుకున్నాడంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తున్నారు. అందరూ మరిచిపోయిన వాణిని బోయపాటి గుర్తుంచుకుని ఆమెకు ఓ ముఖ్య పాత్ర ఇవ్వడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్.. ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











