»   » విశాల్‌కు అదేంటే భయం.. ప్రియుడి గుట్టు బయటపెట్టిన వరలక్ష్మి!

విశాల్‌కు అదేంటే భయం.. ప్రియుడి గుట్టు బయటపెట్టిన వరలక్ష్మి!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Vishal's Greatest Fear Revealed By Her Girl Friend Varalaxmi

  దక్షిణాదిలో సోషల్ రెస్పాన్స్‌బిలిటి ఉన్న హీరోలలో విశాల్ ఒకరు. రైతులకు అన్యాయం జరిగినా లేదా పైరసీదారులకు అక్రమాలకు పాల్పడినా భయమనేది లేకుండా వారిపై పోరాటానికి దూసుకెళ్తుంటాడు. ఇటీవల కాలంలో పైరసీదారులతో అమీతుమీ అనే విధంగా తేల్చుకొంటున్నారు. కాలా చిత్రం పైరసీ చేస్తున్న వారిని కటకటాల వెనుక పెట్టించాడు. అలాంటి ధైర్యం కలిగిన విశాల్‌‌ను అతిగా భయపెట్టే విషయం ఒకటి ఉందంట. ఆ విషయాన్ని స్వయంగా ఆయన ప్రేయసి వరలక్ష్మీ శరత్ కుమార్ బయటపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

  వరలక్ష్మి, విశాల్ అఫైర్

  వరలక్ష్మి, విశాల్ అఫైర్

  గత కొద్దిరోజులుగా వరలక్ష్మీ శరత్ కుమార్‌, విశాల్ మధ్య అఫైర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేశారు. దాదాపు ఆ భవన నిర్మాణం పూర్తి కావొస్తున్నది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.

  పాములంటే విపరీతమైన భయం

  పాములంటే విపరీతమైన భయం

  అయితే ఇటీవల ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ వరలక్ష్మి మాట్లాడుతూ.. హీరో విశాల్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను పంచుకొన్నారు. తన బాయ్‌ఫ్రెండ్‌కు కొన్నంటే భయమని చెప్పారు. ముఖ్యంగా పాములంటే విశాల్‌కు విపరీతమైన భయం అని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

  చేతిపై పాము టాటూ చూసి

  చేతిపై పాము టాటూ చూసి

  పాములంటే విశాల్‌కు ఎంత భయమంటే మాటల్లో చెప్పలేం. నా చేతిపై పాము టాటూ చూసిన విపరీతంగా భయపడి పోతాడు. ఆ భయాన్ని తగ్గించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. ఎప్పటికైనా ఆ భయాన్ని తగ్గించగలనో లేదో చూడాలి అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు.

  సినిమాలతో బిజీగా

  సినిమాలతో బిజీగా

  ఇదిలా ఉండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన మిస్టర్ చంద్రమౌళి, కురుక్షేత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. అలాగే విజయ్ సర్కార్ చిత్రంలోనూ, విశాల్ నటించే సందకోజి2 సినిమాలో నటిస్తున్నారు.

  పందెంకోడి2తో విశాల్

  పందెంకోడి2తో విశాల్

  ఇక విశాల్ పందెంకోడి2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే ఆయన నటించిన మద గజరాజా అనే చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉన్నది. ఇటీవల విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నది.

  English summary
  Varalaxmi Sarathkumar is currently one of the most happening actresses in Tamil cinema. She is awaiting the release of her upcoming film Mr Chandramouli and is busy shooting for many films including Vijay's Sarkar and Vishal's Sandakozhi 2. Varalaxmi spoke about her boyfriend Vishal's greatest fear. The Poda Podi actress said that the President of Tamil Film Producer Council is scared of snakes!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more