»   » పైరసీ చూస్తూ నా డ్రైవరే పట్టుబడ్డాడు: హీరోయిన్ మండిపడుతోంది

పైరసీ చూస్తూ నా డ్రైవరే పట్టుబడ్డాడు: హీరోయిన్ మండిపడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైరసీ... ఇండియన్ సినిమా మాత్రమే కాదు ప్రపంచం లోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో పాతుకు పోయిన ఒక దుర్మార్గం. కొన్ని వందలమందిశ్రమనీ, కొన్ని కొట్ల రూపాయల పెట్టుబడినీ అక్రమ మార్గం లోకి మళ్ళించి దాంతో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నిర్వాకం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. అయితే మన దగ్గర మాత్రం మరీ బరితెగించారు.

పైరసీ

పైరసీ

ఇలా ఇంతగా వేళ్ళూనుకున్న పైరసీ భూతాన్ని పారదోలటానికి తాను ప్రయత్నిస్తాను అంటూ చేసిన వాగ్దానం తోనే విశాల్ ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చాడు. అసలు విశాల్ నిర్మాతల మండలి ఎన్నికల రేసులోకి వచ్చిందే పైరసీ అంశం మీద మాట్లాడి.నిర్మాతల మండలి సభ్యులు సమావేశాలు పెట్టి భజ్జీలు.. బోండాలు తినడం తప్ప పైరసీని ఆపడానికే ఏం చేసింది లేదంటూ గత ఏడాది అతను చేసిన విమర్శలు సంచలనం రేపాయి.

Ram Charan's 2 actresses for Sukumar's film - Filmibeat Telugu
ఇండస్ట్రీ జనాలే పైరసీని ప్రోత్సహిస్తున్నారు

ఇండస్ట్రీ జనాలే పైరసీని ప్రోత్సహిస్తున్నారు

సూర్య సినిమా ఎస్‌-3ని రిలీజ్ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కే అందుబాటులోకి తెస్తామంటూ త‌మిళ్ రాక‌ర్స్ అనే పైర‌సీ వెబ్ సైట్ అధికారికంగా అనౌన్స్ చేయ‌డం ఎంత దుమారం రేపిందో తెలిసిందే.ఇండస్ట్రీ జనాలే పైరసీని ప్రోత్సహిస్తున్నారని.. వాళ్ల ఉదాసీనత వల్లే తమిళ సినిమా దయనీయమైన స్థితికి చేరుకుందని విశాల్ లాంటి వాళ్లు ఆరోపిస్తుంటారు. ఆ తర్వాతే నిర్మాతల మండలితో గొడవ ముదిరి.. ఎన్నికల బరిలో నిలిచాడు విశాల్. గతంలో అతను నేరుగా పైరసీ సీడీ షాపుల మీద దాడి కూడా చేశాడు.

వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్

పైరసీ మీద అతను ముందు నుంచి సిన్సియర్ గా పోరాడుతున్న సంగతి తెలిసిందే. విశాల్ కు మద్దతుగా అతడి ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ ముందుకు రావడం విశేషం.ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సీన్ ముగించుకుని కారవాన్లోకి వెళ్తే అక్కడ ఆమె డ్రైవర్ కోలీవుడ్ కొత్త సినిమా ‘వీఐపీ-2' పైరసీ వెర్షన్ చూస్తూ కనిపించాడట.

తీవ్ర ఆగ్రహానికి గురైందట

తీవ్ర ఆగ్రహానికి గురైందట

దీంతో ఆమె అతడిపై తీవ్ర ఆగ్రహానికి గురైందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది వరలక్ష్మి. ఇండస్ట్రీతో టచ్ ఉన్న వాళ్లే ఇలా చేస్తే.. ఇక పైరసీ నుంచి సినిమాల్ని ఎవరు కాపాడతారని ఆమె ప్రశ్నించింది. దయచేసి పైరసీని ప్రోత్సహించి.. ఇండస్ట్రీని నాశనం చేయొద్దని ఆమె విజ్నప్తి చేసింది.

English summary
Varalaxmi Sarathkumar caught her caravan Driver watching VIP 2 Piracy Print
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu