»   » లవకుశ: వరుణ్ సందేష్ ముద్దు సీన్లు (టీజర్)

లవకుశ: వరుణ్ సందేష్ ముద్దు సీన్లు (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల గురించి బాగా అవగాహన, ఆసక్తి ఉన్నవారికి తప్ప అసలు వరుణ్ సందేశ్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో....ఎప్పుడు పోతున్నాయో సాధారణ ప్రేక్షకులకు తెలియని పరిస్థితి. చాలా ఏళ్ల క్రితం వచ్చిన హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం తర్వాత ఆ రేంజిలో చెప్పుకోదగ్గ హిట్టు ఈ మధ్య కాలంలో వరుణ్ సందేశ్ ఒక్కటంటే ఒక్కటి కూడా రుచి చూసిన దాఖలాలు లేవు.

Varun Sandesh 'Lava Kusha'

తాజాగా వరుణ్ సందేశ్ నటిస్తున్న చిత్రం ‘లవ కుశ'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసారు. వరుణ్ సందేశ్ తొలిసారిగా ద్విపాత్రయభినయం చేస్తున్న సినిమా ‘లవకుశ'. జయశ్రీ శివన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వరుణ్సందేశ్ సరసన రిచా పనై, రుచి త్రిపాటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Varun Sandesh 'Lava Kusha'

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సత్య మోహన్, ప్రకాష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఎక్కువ భాగం మలేషియాలో జరిగింది. ఈ చిత్రంలో కమెడియన్ బాబు మోహన్ కూడా నటిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల తేదీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ సినిమాపై వరుణ్ సందేశ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Varun Sandesh 'Lava Kusha'
English summary
Lava Kusha is a Telugu Movie. Directed by Jaya Sri Sivan. Varun Sandesh, Richa Panai, Ruchi Tripathi in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu