twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెదనాన్న ప్రత్యేక శ్రద్ద చూపించారు.. సైరా, అంతరిక్షం పక్కపక్కనే.. వరుణ్ తేజ్!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రతి సినిమాకు మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ కనబరుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కంచె చిత్ర ఫలితం ఎలా ఉన్నా వరుణ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ట్రెండుకు తగ్గట్లుగా ప్రేమ కథలు ఎంచుకుని ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుణ్ ఘనవిజయం అందుకున్నాడు. వరుణ్ తేజ్ కు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పడింది. వరుస విజయాల తరువాత అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో వరుణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలవుతుండగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

    ఆకట్టుకుంటుందనే నమ్మకం

    ఆకట్టుకుంటుందనే నమ్మకం

    వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతో అంతరిక్షం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న చిత్రం అని తెలిపాడు. అంతరిక్ష పరిశోధన, స్పేసులో ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి ఒక్కరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని వరుణ్ తేజ్ తెలిపాడు. సంకల్ప్ రెడ్డి దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటించారు.

    అంచనాలు పెరిగాయి

    అంచనాలు పెరిగాయి

    ఇటీవల విడుదుల చేసిన ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపిందని వరుణ్ తేజ్ తెలిపాడు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులంతా ట్రైలర్ చూసి అభినందించారు అని తెలిపాడు. నాన్నకు ట్రైలర్ విడుదలకు నాలుగురోజుల ముందే చూపించా. ఆయనకు చాలా బాగా నచ్చింది. అమ్మ, నిహారిక కూడా ట్రైలర్ బావుందని అన్నారు.

     పెదనాన్న ఫోన్ చేసి

    పెదనాన్న ఫోన్ చేసి

    ఇక పెదనాన్న చిరంజీవిగారు ట్రైలర్ చూసి ఫోన్ చేశారు. చాలా బావుందని ప్రశంసించారు. పెదనాన్న నా ప్రతి సినిమా గురించి తెలుసుకుంటుంటారు. కానీ ఈ చిత్రపై ఆయన ప్రత్యేక శ్రద్ద చూపించారని వరుణ్ తెలిపాడు. ఈ చిత్ర జీరో గ్రావిటీ షూటింగ్ చేస్తున్నప్పుడు పక్క సెట్ లోనే సైరా షూటింగ్ జరుగుతోంది. ఆ సందర్భంలో పెదనాన్నని కలిశా. అప్పటినుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకుంటున్నారు అని వరుణ్ తేజ్ తెలిపాడు.

    వాళ్లిద్దరూ పెద్ద ప్లస్

    వాళ్లిద్దరూ పెద్ద ప్లస్

    అంతరిక్షం లాంటి చిత్రానికి సినిమాటోగ్రఫీ, బ్యాగ్ గ్రౌండ్ సంగీతం చాలా కీలకం. జ్ఞానశేఖర్ గారి అద్భుతమైన పనితనం ఈ చిత్రంలో తెలుస్తుంది అని వరుణ్ తెలిపాడు. ఈ సినిమాకు ఎలాంటి సినిమాటోగ్రఫీ అందించాలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. షూటింగ్ సమయంలో ఆయన కెమెరాని ఈ యాంగిల్ లో ఎందుకు పెడుతున్నారు అని అనుకునేవాడిని. కానీ అవుట్ ఫుట్ చూశాక అదరగొట్టేశారు అనిపించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని వరుణ్ తెలిపాడు.

    English summary
    Varun Tej About Chiranjeevi Phone Call over Antariksham Trailer. Sankalp Reddy directing this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X