Just In
Don't Miss!
- News
సీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీ
- Finance
హైదరాబాద్ సహా సిటీల్లో హౌసింగ్ సేల్స్ జంప్, పూర్తి ఏడాది పరంగా డౌన్
- Sports
పెళ్లిపై మాట్లాడేందుకు నిరాకరించిన మహ్మద్ సిరాజ్!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వారం రోజుల క్వారంటైన్.. వరుణ్ తేజ్ పిక్ వైరల్
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్వారంటైన్‌లో ఉన్న సంగత తెలిసిందే. రామ్ చరణ, వరుణ్ తేజ్‌లు ఇద్దరూ కూడా కరోనా పాజిటివ్ సోకడంతో క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. మెగా ఫ్యామిలీలో ఈ కరోనా తాండవం చేయడంతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కూడా అంతగా జరగలేవు. కానీ అల్లు ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యామిలీలోని కొంత మంది కలిసి న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇక రామ్ చరణ్‌తో పాటు ఉపాసన క్వారంటైన్‌లో ఉంది. కానీ వరుణ్ తేజ్ మాత్రం సింగిల్‌గానే క్వారంటైన్‌లో ఉంటూ వస్తున్నాడు. వరుణ్ తేజ్ కోసం ఉపాసన స్పెషల్‌గా డైట్ కూడా పంపించింది. కరోనాపై పోరాడేందుకు తీసుకోవాల్సిన పదార్థాలను పంపిస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. త్వరగా కోలుకో వరుణ్ అంటూ ఉపాసన వాటిని పంపించింది. ఇక వరుణ్ తన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను క్వారంటైన్‌లోనే కానిచ్చేశాడు.

ఇక వరుణ్ తేజ్ తన కొత్త సంవత్సరం వేడుకలను వర్చువల్‌గానే జరుపుకున్నాడు. తన ఫ్రెండ్స్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతూ క్వారంటైన్‌లో అలా ఎంజాయ్ చేస్తుండిపోయాడు. మొత్తానికి నేటికి వారం రోజులు అయ్యాయని తన క్వారంటైన్ డైరీస్ గురించి చెప్పుకొచ్చాడు. అయితే త్వరలోనే వరుణ్‌కు కరోనా నెగెటివ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వరుణ్ తన బాక్సర్ సినిమా షూటింగ్‌ను కాస్త ఆలస్యంగా మొదలెట్టేలా కనిపిస్తోంది.