»   » మెగా హీరో వరుణ్ తేజ్‌కు గాయాలు!

మెగా హీరో వరుణ్ తేజ్‌కు గాయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ కేరళలో జరుగుతోంది. షూటింగులో భాగంగా కేరళలోని అలెప్పీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా వరుణ్‌కు చిన్నపాటి గాయం అయినట్లు తెలుస్తోంది.

అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, కాలు బెనకడం వల్లనే ఇలా జరిగిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకున్న అనంతరం తిరిగి వరుణ్ తేజ్ షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు.

 Varun Tej injured in shoot

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమా రూపొందబోతోంది. ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు.

గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో వరుణ్‌తేజ్‌ తొలి చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

English summary
Mega hero Varun Tej who is shooting for his debut film, Gollabhama injured himself in the movie shoot at Allepey, Kerala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu