Just In
Don't Miss!
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Sports
పతంగి ఎగురవేసిన ఇర్ఫాన్ పఠాన్.. కైట్ కోసం పిల్లల పాట్లు వీడియో
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాబాయే అందగాడు: వరుణ్ తేజ్ ఫేవరెట్స్ ఇవే
హైదరాబాద్: ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టా ఇష్టాలను వెల్లడించారు. ఒక్కో సినిమా విషయంలో ఒక్కో దర్శకుడు నచ్చుతాడు. వీళ్లే సూపర్ అని చెప్పలేం. ఒకరిద్దరి పేర్లు చెప్పాల్సి వస్తే క్రిస్టఫర్ నోలన్, స్పీవెన్ స్పీల్ బర్గ్ పేర్లు చెబుతాను అన్నారు.
నా ఫేవరెట్ నటి ప్రియాంక చోప్రా. తను స్కిన్ షోకే పరిమితం కాకుండా నటనలో కూడా వేరియేషన్స్ చూపుతుంది అన్నారు. కాఫీ తాగుతున్నా, పార్టీకెలుతున్నా...ఇలాంటివి చెప్పుకోవడానికి ఫేస్ బుక్, ట్విట్టర్లంటే నచ్చదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమా అప్ డేట్స్ కోసం రాక తప్పలేదు అన్నారు.

ఒకప్పుడు షార్ట్స్, నిక్కర్లు వేసుకుని తిరిగే వాన్ని, ఇపుడు ఫ్యాషన్ ట్రెండ్స్ గమనిస్తున్నాను. కొత్త మోడల్ షూస్ వేసుకోవడం అంటే ఇష్టం అన్నారు. మెగా ఫ్యామిలీలో నువ్వే అందగాడివని అంటారంతా. నాకైతే బాబాయ్ అందంగా ఉంటాడనిపిస్తుంది. మా ఒక్కొక్కరిలో ఒక్కో అందం ఉందని తెలిపాడు వరుణ్ తేజ్.
సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి ఎక్కువే. టెన్త్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ స్కూలును దత్తత తీసుకుని ఏడాదిన్నర నడిపించాం. తర్వాత డబ్బులేక ఆపేసామన్నారు వరుణ్ తేజ్. నాకు ఇష్టమైన ఆట వాలీబాల్. ప్రతిరోజూ గంటయినా ఆడతాను. చిన్నప్పటి నుండి నాతో చదువుకున్న పది మంది నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లతో అన్ని విషయాలు పంచుకుంటాను అని చెప్పుకొచ్చారు.