»   »  ఆశ్చర్యపరుస్తున్న వరుణ్ కొత్త లుక్.. వ్యోమగామి!

ఆశ్చర్యపరుస్తున్న వరుణ్ కొత్త లుక్.. వ్యోమగామి!

Subscribe to Filmibeat Telugu
Varun Tej New look in Sankalp Reddy Movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కెరీర్ పరంగా మంచి జోరుమీద ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి చిత్రం వరుసగా విజయం సాధించడంతో వరుణ్ తేజ్ క్రేజ్ పెరిగింది. దర్శక నిర్మాతలు ఈ మెగా హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఘాజి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొని ఉంది.

ఈ చిత్రం అంతరిక్ష పరిశోధన కథాంశంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజగా వరుణ్ తేజ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీసాలు, క్లీన్ షేవ్ లుక్ లో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. అభిమానులకు వరుణ్ తేజ్ లుక్ తెగ నచ్చేస్తుంది.

Varun Tej news look goes viral in social media

ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఘాజి చిత్రంలో సబ్ మెరైన్ వార్ చూపించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కాగా ఈ చిత్రానికి వ్యోమగామి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
Varun Tej news look goes viral in social media. Varun Tej new movie with Sankalp Reddy on sapce research.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X