»   »  అఫీషియల్: వరుణ్ తేజ్ ‘కంచె’ ఫస్ట్‌లుక్ (ఫోటో)

అఫీషియల్: వరుణ్ తేజ్ ‘కంచె’ ఫస్ట్‌లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘కంచె' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వరుణ్ తేజ్ తన అషీపియల్ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసారు. దీన్ని విడుదల చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను... ఎలా ఉంది ఈ లుక్ అంటూ వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ఈ లుక్ సూపర్ అంటూ పలువురు మెగా అభిమానులు అతనికి రిప్లై ఇవ్వడం గమనార్హం.

ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు రోజుల క్రితమే షూటింగ్ పూర్తయింది. ఈచిత్రంలో వరుణ్ తేజ్ సైనికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటించింది.

Varun Tej reveals Kanche first look

మరో వైపు పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "లోఫర్" అనే టైటిల్ ని పూరి ఫిక్స్ చేసారు. తొలి సినిమా ‘ముకుంద'తో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమా నుండి వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట.

English summary
Mega hero Varun Tej has unveiled the first look of his forthcoming film ‘Kanche’. He was seen holding a gun on his hand and it seems that he will play the role of a soldier in this movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu