»   » ఇద్దరు హీరోయిన్లతో ‘పీల్ మై లవ్’ అంటున్న వరుణ్ తేజ్!

ఇద్దరు హీరోయిన్లతో ‘పీల్ మై లవ్’ అంటున్న వరుణ్ తేజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ ఓకే అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.

కెరీర్లో తొలిసారిగా వరుణ్ తేజ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ గా రెజీనా ఎంపికయినట్లు సమాచారం. ఈ చిత్రానికి 'ఫీల్ మై లవ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందించబోతున్నారు. మెగా నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఏప్రిల్ లో అఫీషియల్ గా సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Varun Tej's 'Feel My Love' with Lavanya and Regina!

ఈ మధ్య వరుస ప్లాపులతో శ్రీను వైట్ల చాలా వునకబడి పోయాడు. ఆయన మహేష్ బాబుతో చేసిన 'ఆగడు', రామ్ చరణ్ తో చేసిన 'బ్రూస్ లీ' బాక్సాఫీసు వద్ద భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో శ్రీను వైట్లతో స్టార్ హీరోలు చేయడానికి విముఖత చూపుతున్నారు. దీంతో చిన్న హీరోలతో హిట్టు కొట్టిన మళ్లీ ఫాంలోకి రావాలని వైట్ల ఫిక్సయినట్లు స్పష్టమవుతోంది.

మరో వైపు వరుణ్ తేజతో అనుకున్న రెండు ప్రాజెక్టులు అనుకోని విధంగా వెనక్కి వెళ్లాయి. క్రిష్ తో అనుకున్న రాయబారి చిత్రం బడ్జెట్ సమస్యలతో పట్టాలు ఎక్కే పరిస్ధితి కనపడటం లేదు. జార్జియాలో లొకేషన్స్ స్కౌంటింగ్ చేసుకుని వచ్చిన క్రిష్... సినిమా బడ్జెట్ ఇరవై కోట్లు వరకూ అవుతుందని అంచనా వేసి, ప్రక్కన పెట్టేసినట్లు సమాచారం. ఇక గోపిచంద్ మలినేని తో అనుకున్న సినిమా కూడా ఇప్పుడు వెనక్కి వెల్లిపోయింది. ఈ రెండు ప్రాజెక్టులు ఆగి పోవడంతో ఇపుడు శ్రీను వైట్లతో సినిమా ఓకే చేసుకున్నాడు వరుణ్ తేజ్.

English summary
For the first time ever, Varun Tej will be romancing Two Heroines in Vytla's flick. Lavanya Tripathi and Regina Cassandra were roped to play female leads. Touted to be a love story, Varun Tej-Srinu Vytla's flick has been titled as 'Feel My Love'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu