»   » ఆగే మాటే లేదు..... రూమర్లకు చెక్ పెట్టిన వరుణ్ తేజ్

ఆగే మాటే లేదు..... రూమర్లకు చెక్ పెట్టిన వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు కి వారసుడిగా టాలీ వుడ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ తండ్రి కలని నిజం చేసేటట్టే ఉన్నడు. నాగబాబు ఎంత ప్రయత్నించినా ఎందుకనో హీరో గా రాణించలేకపోయాడు. నటుడిగా మంచి పేరే ఉన్న నాగబాబు హీరో అన్న ట్యాగ్ కి మాత్రం దూరంగా నే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ తండ్రి చేయలేని పనిని చేసి చూపించబోతున్నాడు. మంచి భవిశ్యత్ ఉన్న హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్.... ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లు మొదలౌతున్నాయి...

ఇలాంటి సమయం లోనే కెరీర్ పరంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి. మూడు సినిమాలతో ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న వరుణ్ తేజ్ శ్రీనువైట్లతో తీస్తున్న సినిమా వచ్చిన వార్తలు కాస్త కలకలం రేపాయి. శ్రీను వైట్ల "మిస్టర్" మొదలు కాక ముందే శేఖర్ కమ్ములతో సినిమా చేయటానికి వరుణ్ రెడీ అయిపోవటం తో ఇక మిస్టర్ అటక మీద కూచున్నట్టే అనుకున్నారంటా...

varun

మొదలు పెడుతున్నాం అని అధికారికంగా అనౌన్స్ చేసిన సినిమా ఏమాత్రం లేట్ అయినా ఇలాంటి వార్తలే వస్తాయి. కాస్త ఇమేజ్ ఉన్న హీరో విశయం లో మరీ ఎక్కువగా ఈ కాన్సంట్రేషన్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా క్లాప్స్ కొట్టించిన సినిమా ఇప్పటిదాకా స్టార్ట్ అవ్వలేదు. దాంతో సినిమా మీద రోజుకో రకమైన రూమర్ వస్తుండటంతో తానే స్వయంగా ఒక క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్.

స్పెయిన్ జూన్ 27 నుండి "మిస్టర్" షూటింగ్ స్టార్ట్ అవబోతుందనీ, చాలా ఎక్సైటింగ్ గా ఫీలౌతున్నాననీ ట్వీట్ చేశాడు. సో ఈ ట్వీట్ తో సినిమా ఆగిందన్న రూమర్లకు సమాధానం చెప్పాడు ఈ "మెగా ప్రిన్స్" (ఈ మధ్య ఇలానే అంటున్నారు మరి). గోపి మోహన్ కథ అందించగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

పూరీ తో చేసిన "లోఫర్" నిరాశ పరిచిన తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టే ప్లాన్లో ఉన్నాడు. ఇక ఇది పూర్తయ్యాక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చే సినిమా మొదలవుతుందట.

English summary
Actor Varun Tej’s upcoming Telugu film “Mister”, which will be directed by Srinu Vaitla, will go on floors in Spain later this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu