»   » కసితో హిట్ కొట్టేందుకు శ్రీనువైట్ల సిద్ధం.. కాంప్రమైజ్ లేకుండా మిస్టర్!

కసితో హిట్ కొట్టేందుకు శ్రీనువైట్ల సిద్ధం.. కాంప్రమైజ్ లేకుండా మిస్టర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు విష్టుతో ఢీ, మహేశ్ బాబుతో దూకుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో బాద్షా లాంటి హిట్ చిత్రాలను టాలీవుడ్‌కు అందించారు దర్శకుడు శ్రీనువైట్ల. ఆ తర్వాత ఆగడు, బ్రూస్‌లీ విజయం సాధించినప్పటీకి అభిమానులను కొంత నిరుత్సాహానికి గురిచేశాయనే మాట వినిపించింది. అయితే మరోసారి దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని అందించేందుకు కసిగా మెగా హీరో వరుణ్‌తేజ్‌తో జతకట్టారు.

ఏప్రిల్ 13న మెగా హీరో ప్రేక్షకుల ముందుకు..

ఏప్రిల్ 13న మెగా హీరో ప్రేక్షకుల ముందుకు..

వినోదం, యాక్షన్, లవ్ అంశాలను మేళవించి అన్నివర్గాల ప్రేక్షకులకు ఫీల్‌గుడ్ మూవీని అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ప్రేక్షకులకు మరింత చేరువకావడానికి మిస్టర్ చిత్రాన్ని ఒకరోజు ముందుకు జరిపి ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియాతో మాట్లాడారు.

 చాలా రోజులుగా ఎదురుచూశాను..

చాలా రోజులుగా ఎదురుచూశాను..

వరుణ్ తేజ్ నటించిన `మిస్ట‌ర్` చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నాం. ఒక్క పాట‌ మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్తైంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డైరెక్ట‌ర్‌గా `మిస్ట‌ర్‌` లాంటి క‌థ‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూశాను. చ‌క్క‌టి భావోద్వేగాల‌కు, క‌డుపుబ్బ న‌వ్వుకునే వినోదానికి, విన‌సొంపైన సంగీతానికి, క‌నువిందు చేసే దృశ్యాల‌కు అనువుగా ఉన్న క‌థ ఇది అని ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల తెలిపారు.

 నో కాంప్రమైజ్.. థ్యాంక్స్

నో కాంప్రమైజ్.. థ్యాంక్స్

మిస్టర్ సినిమా అవుట్‌పుట్ చాలా సంతృప్తిక‌రంగా ఉంది. నేను ఏదైతే అనుకున్నానో దానిని వందశాతం ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. అందుకు నా నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్. అంద‌రూ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ట్రావెల్ ఫిల్మ్ త‌ర‌హాలో `మిస్ట‌ర్‌` చిత్రం సాగుతుంది అని ఆయన వెల్లడించారు.

అద్భుతమైన లొకేషన్లలో..

అద్భుతమైన లొకేషన్లలో..

స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్‌మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశాం. ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ సెట్ సాంగ్ చేశాం. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఇట‌లీలో తెర‌కెక్కించే పాట‌తో షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుంది అని చెప్పారు.

తొలిసారి మిక్కి జే మేయర్‌తో

తొలిసారి మిక్కి జే మేయర్‌తో

సంగీత దర్శకుడు మిక్కి జే మేయ‌ర్‌తో తొలిసారి ప‌నిచేశాను. ఇందులో ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. మిక్కి అన్ బిలీవ‌బుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ మొద‌టివారంలో ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం అని శ్రీను వైట్ల అన్నారు.

ఏప్రిల్ మెుదటి వారంలో ఇటలీలో..

ఏప్రిల్ మెుదటి వారంలో ఇటలీలో..

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ ఏడు ఎకరాల స్టూడియోలో సెట్లో ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ఇంకో పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఆ పాట‌ను ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఇట‌లీలో తెర‌కెక్కించ‌నున్నాం అని శ్రీను వైట్ల పేర్కొన్నారు.

వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్

వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్

మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌ సరసన లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్ నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రిన్స్‌, నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు న‌టించారు.

నిర్మాతలుగా బుజ్జి, ఠాగూర్ మధు

నిర్మాతలుగా బుజ్జి, ఠాగూర్ మధు

ఈ చిత్రానికి సాహిత్యం రామ‌జోగ‌య్య శాస్త్రి, క‌థ గోపీ మోహ‌న్‌, మాట‌లు శ్రీధ‌ర్ సీపాన‌ అందించారు. కెవి.గుహ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ అందించిన మిస్టర్‌కు న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాతలుగా వ్యవహరించారు.

English summary
Director Srinu Vaitla, Hero Varun Tej's latest movie Mister is gearing up to release on April 13. In this occation director Srinu Vaitla spoke to Media. He said that Since so many days I waited for this kind of subject. I Picturised this subject without any compromise.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu