twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్టర్‌కు కోత పడింది.. నిర్మాతలకు రెండో షాక్..నిరాశలో వరుణ్!

    మిస్టర్ చిత్ర కథ, సీన్లు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమైంది.

    By Rajababu
    |

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ నటించిన మిస్టర్ చిత్రంపై తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి ప్రతికూలమైన టాక్‌ వినిపించింది. సినిమా నిడివి ప్రధాన సమస్య అనేది ఆడియెన్స్ తీర్పు ఇచ్చారు. బలహీనమైన కథ, కథనం, అనవసరపు సీన్లు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓ దశలో సినిమా అయిపోయిందని ప్రేక్షకులు లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరో ఎపిసోడ్ రావడం ప్రేక్షకులను అసహనానికి గురిచేసింది. దాంతో చిత్ర నిర్మాతలు సినిమా నిడివిని 10 నిమిషాలు తగ్గించినట్టు సమాచారం.

    నిరాశలో వరుణ్..

    నిరాశలో వరుణ్..

    మిస్టర్ సినిమాకు ఊహించని విధంగా ప్రతికూలమైన టాక్ రావడంతో హీరో వరుణ్ తేజ్ తీవ్ర నిరాశకు లోనైనట్టు సమాచారం. ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని ఆశపడిన వరుణ్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు వరుణ్ నటించిన ముకుంద, కంచె చిత్రాలు క్లాస్‌వే. మిస్టర్‌తోనైనా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకుందామనే కోరికకు ఆదిలోనే హంసపాదు పడింది.

    అనవసరపు సీన్ల ఎత్తివేత.

    అనవసరపు సీన్ల ఎత్తివేత.

    సినిమాను థియేటర్లలో నిలబెట్టేందుకు నిర్మాత, దర్శకులు పోస్ట్ మార్టమ్ ప్రారంభించారు. సినిమా నిడివిని, అనవసరపు సీన్లను ఎత్తి వేస్తే ప్రేక్షకులకు ఉపశమనం ఉంటుందనే అభిప్రాయం మేరకు మిస్టర్ సినిమా నిడివి మొత్తం నుంచి పది నిమిషాల మేర కత్తెర వేసినట్టు తెలిసింది. దీంతో కొంత సినిమాలో వేగం పెరిగి ఆడియెన్స్‌లో అసహనం తలెత్తకుండా సినీ నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకొన్నట్టు సమాచారం. దీంతో సినిమా కొంత పర్వాలేదనే టాక్ బయటకు వచ్చింది.

    సెకాండాఫ్‌పై కోత

    సెకాండాఫ్‌పై కోత

    మిస్టర్‌ సినిమా ప్రథమార్థంలో రఘుబాబు, శ్రీనివాస్‌రెడ్డి కామెడీ, పృథ్వీ హాస్యంతో చాలా సాఫీగానే సాగిపోయింది. కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి విజయనగర రాజవంశం ఎపిసోడ్, హాస్పిటల్‌లో మురళీశర్మ గ్యాంగ్, ప్రియదర్శి కామెడీ ఎందుకురా బాబు అనేంతగా బోర్ కొట్టించింది. కీలకమైన తాత, మనుమడు సెంటిమెంట్‌పై భారీగా ప్రభావం పడింది. క్లైమాక్స్‌కు చేరుకొనే లోపే ప్రేక్షకులు టోటల్‌గా చేతులెత్తే పరిస్థితి కనిపించింది. తాజా ఎడిటింగ్‌తో సినిమా కొంతలో కొంత మంచిగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    తొలి రోజు కలెక్షన్లు ఇలా..

    తొలి రోజు కలెక్షన్లు ఇలా..

    మిస్టర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు కలెక్షన్లనే రాబట్టింది. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో రూ.3.22 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. వీకెండ్‌లో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కుటుంబ కథ చిత్రాలు లేకపోవడంతో మిస్టర్‌ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ పెరిచే ఛాన్స్ ఉంది.

    నిర్మాతలకు రెండో..

    నిర్మాతలకు రెండో..

    నిర్మాతలకు సంబంధించి బుజ్జి, టాగోర్ మధుకు వరుసగా ఇది రెండో ఎదురుదెబ్బ. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో తీసిన విన్నర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మిస్టర్ చిత్రానికి కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నది. టాగోర్ మధు సహ నిర్మాతగా మహేశ్ బాబు స్పైడర్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

    English summary
    Reports suggested that Mister producers are now trimming the movie by 10 minutes. The new version would be little bit fast comparatively earlier version. There is a news that Hero Varun Tej is nervous bit due to nagative talk over the mister.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X