Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఫీషియల్: వరుణ్ తేజ నెక్ట్స్ చిత్రం ప్రకటన
హైదరాబాద్ : 'ముకుంద' చిత్రంతో పరిచయమైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తన తదుపరి చిత్రం ప్రకటన వచ్చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది ఈ మేరకు పోస్టర్ విడుదల చేసారు. ఈ రోజు వరుణ్ తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేసారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
పూర్తి వివరాల్లోకి వెళితే...
తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' చిత్రాన్ని చేసిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు.
అలాగే, ఈ కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కల్యాణ్ తెలిపారు. నితిన్ తో ఒక సినిమా, నాగచైతన్య తో ఒక సినిమా ప్లానింగులో వున్నాయని చెప్పారు.
'కేడీ' సినిమా తర్వాత నాగార్జునతో ఓ సినిమా నిర్మించాల్సివుందనీ, సరైన కథ దొరకక ఇంకా సెట్స్ కి వెళ్ళలేదనీ అన్నారు. ఇటీవలే నాగార్జున కోసం... నలుగురు అమ్మాయిల మధ్య హీరో అనే కాన్సెప్టుతో ఓ కథ విన్నానని ఆయన తెలిపారు. ఇది నాగార్జునకు బాగా సూటవుతుందని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా తమకు వచ్చే ఏడాది ఓ సినిమా వుందని నిర్మాత కల్యాణ్ తెలియజేశారు.