»   » అసలే బాబాయ్ మ్యాటర్, తేడా వస్తే పగలిపోద్దని డైరెక్టర్‌కు చెప్పా: వరుణ్ తేజ్

అసలే బాబాయ్ మ్యాటర్, తేడా వస్తే పగలిపోద్దని డైరెక్టర్‌కు చెప్పా: వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వ‌రుణ్‌తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం తొలి ప్రేమ‌. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు. ఆడియో వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 డైరెక్టర్‌కు పగిలిపోద్దని చెప్పాను

డైరెక్టర్‌కు పగిలిపోద్దని చెప్పాను

హీరో వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - `ఈ సినిమా మొదలైన ఆరు నెల‌ల వ‌ర‌కు ఏ టైటిల్ పెడ‌దామ‌ని చాలా ఆలోచించాం. చాలా టైటిల్స్ అనుకున్నాం. మధ్యలో ద‌ర్శకుడు వెంకీ, నిర్మాత బాబీ వచ్చి ‘తొలిప్రేమ' అని పెడదాం అన్నారు. నాకు అది నచ్చినా కూడా చాలా భయమేసింది. ఆ టైటిల్ పెట్టుకుంటే తేడా ఏమైనా వస్తే పగిలిపోద్దని చెప్పాను. అభిమానులు ఊరుకోరు అని చెప్పాను' అని వరుణ్ తేజ్ తెలిపారు.

 బాబాయ్ ఐకానిక్ ఫిల్మ్, చెడగొట్టకుండా చేశాం

బాబాయ్ ఐకానిక్ ఫిల్మ్, చెడగొట్టకుండా చేశాం

‘తొలి ప్రేమ' చిత్రం బాబాయ్ ఐకానిక్ ఫిల్మ్. ఆ సినిమాకు ఎంత రెస్పెక్ట్ ఉందో, ఎంత ఆదరణ చూపించారో మా అందరికీ తెలుసు. దాని పాడుచేయకుండా, ఆ టైటిల్ కు న్యాయం చేస్తామనే నమ్మకం ఉంది. సినిమా చూసిన తర్వాత ఎవరూ డిసప్పాయింట్ అవ్వరు, ఈ టైటిల్ సినిమాకు యాప్ట్ అని అంటారు.... అని వరుణ్ తేజ్ తెలిపారు.

వెంకీని ఆపాను, నా కోసం ఆగాడు

వెంకీని ఆపాను, నా కోసం ఆగాడు

లోఫ‌ర్‌, ఫిదా కంటే ముందే ఈ క‌థ‌ను విన్నాను. క‌థ బాగా నచ్చింది. నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన క‌థ‌. అప్పుడు డేట్స్ కుదరక పోవడంతో త‌న‌ను కొన్ని రోజులు వెయిట్ చేయ‌మ‌ని అన్నాను. త‌ను నా కోసం వెయిట్ చేశాడు.... అని వరుణ్ తెలిపారు.

Varun Tej Next Movie Title పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్
 హీరోయిన్లను వెతకడం చాలా కష్టం

హీరోయిన్లను వెతకడం చాలా కష్టం

నాకు హీరోయిన్స్ వెత‌క‌డం అంటే చాలా క‌ష్టం. నా హైట్‌కు స‌రిపోరు. కానీ తొలిసారి నా హైట్‌కు స‌రిపోయేలా రాశిఖ‌న్నా దొరికింది. వ‌ర్ష అనే క్యారెక్ట‌ర్‌కు రాశి త‌న న‌ట‌న‌తో న్యాయం చేసింది.... అని వరుణ్ చెప్పుకొచ్చారు.

అంతా బాగా చేశారు

అంతా బాగా చేశారు

మా నిర్మాత‌లు బాబీ, భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. మా బాబాయ్‌, బ‌న్ని అన్న‌తో ఆయ‌న సినిమాలు చేశారు. నాకు కూడా మంచి సినిమా ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్. ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది స‌హా నా ప‌ర్స‌న‌ల్ ప్రెండ్స్ కూడా ఈ సినిమాలో న‌టించారు. మంచి ప్రేమ‌క‌థ‌కు మంచి సంగీతం, మంచి కెమెరా వ‌ర్క్ ఉండాలి. త‌మ‌న్ మంచి మ్యూజిక్‌,. జార్జ్ మంచి విజువ‌ల్స్ అందించారు... అని వరుణ్ తేజ్ తెలిపారు.

దాన్ని గుర్తు చేసుకోకుంటే ఈ ఫంక్షన్ కు వ్యాల్యూ లేదు

దాన్ని గుర్తు చేసుకోకుంటే ఈ ఫంక్షన్ కు వ్యాల్యూ లేదు

దిల్ రాజు మాట్లాడుతూ - ``ఈ తొలిప్రేమ ఆడియో వేడుక‌లో ఆ తొలిప్రేమ‌ను గుర్తు చేసుకోవాల్సిందే. అలా చేయకుంటే ఈ ఫంక్షన్ కు వ్యాల్యూ లేదు. 20 సంవ‌త్స‌రాలు క్రితం ప‌వ‌న్ తొలిప్రేమ విడుదలైంది. ఆ తొలి ప్రేమ ప్రేక్ష‌కుల‌ను ఎలా ఊర్రుత‌లూగించిందో... ఈ తొలి ప్రేమ కూడా అలాగే ఊర్రుత‌లూగిస్తుంది.... అని దిల్ రాజు తెలిపారు.

మా బేనర్లో చేయాల్సిన సినిమా

మా బేనర్లో చేయాల్సిన సినిమా

ఫిదాకు ముందు వెంకీ ఈ సినిమాను మా బ్యాన‌ర్‌లో చేయాల్సింది. కానీ ఫిదా కార‌ణంగా నేను బిజీగా ఉండటంతో త‌ను బాపినీడుకి క‌థ వినిపించాడు. త‌న‌కు న‌చ్చ‌డంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యాన‌ర్‌లో చేయాల్సిన సినిమాను వారి బ్యాన‌ర్‌లో చేశార‌నే కారణంతో... బాపినీడు ఈ సినిమా టోట‌ల్ రైట్స్‌ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విష‌యాలు అరుదుగా జ‌రుగుతుంటాయి. 1998లో ఆ తొలిప్రేమ ఎలాంటి సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిందో 2018లో ఈ తొలి ప్రేమ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.. అని దిల్ రాజు తెలిపారు.

English summary
Varun Tej Speech at Tholi Prema Audio Launch. Starring Varuntej, RaasiKhanna.Directed By Venky Atluri, Music Composed By S S Thaman, Produced by BVSN PRASAD under the Banner of Sri Venkateswara Cine Chitra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu