»   » వరుణ్ తేజ్ గ్యాంగ్ లీడర్... పోలా..! అదిరిపోలా..!!

వరుణ్ తేజ్ గ్యాంగ్ లీడర్... పోలా..! అదిరిపోలా..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరోజుల్లో చిరంజీవి ని మాస్ హీరోగా జనాలకి మరీ దగ్గరగా తీసుకు వెళ్ళీన సినిమా గ్యాంగ్ లీడర్.ఆరోజుల్లో మెగాస్టార్ రేంజ్ అమాంతం దూసుకు పోయింది. థియేతర్లకి దూరంగా ఉన్న ఊళ్ళలో కూడా రెండేళ్ళ పిల్లాడు కూడా "చెయ్యి చూసావా ఎంత రఫ్ఫుగా ఉందో.., రఫ్ఫాడించేస్తా" అంటూ చిరు పంచ్ డైలాగ్ చెప్పేవాళ్ళంటే ఆరోజుల్లో గ్యాంగ్ లీదర్ ఏ రేంజ్ హిట్టో ప్రత్యేకంగా చెప్పే పని లేదు....

Varun Tej turns Chota Gang Leader

ఆ చిత్రంలోని డైలాగ్స్ కానీ, చిరు మేనరిజమ్ కానీ.. మెగా అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మరి ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలమీదే చిరు గ్యాంగ్ లీడర్ ప్రభావం ఉంటే ఇక ఇంట్లోనే ఉండే పిల్లలసంగతేంటీ...? అలాంటి 'గ్యాంగ్ లీడర్'ను చోటా గ్యాంగ్‌‌లీడర్ వరుణ్ తేజ్ ఆ రోజుల్లో ఇమిటేట్ చేశాడు ఆ ఫోజులో ఫొటో కూడా దిగాడు.. మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన చిన్న వయస్సులో మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో ఒకే సారి ఇటు తన ఫేస్ బుక్ పేజ్ వాల్ మీదా, అటు ట్విటర్ లోనూ పోస్ట్ చేసాడు.

Varun Tej turns Chota Gang Leader

చిన్నప్పుడు గ్యాంగ్‌‌‌‌లీడర్ సినిమాలోని మెగాస్టార్‌ను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించానని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఆ సినిమాలో చిరు చొక్కా కాలర్‌ పైకి ఎత్తే స్టైల్‌కు వరుణ్ పోజిచ్చాడు. మెగాస్టార్ చిరంజీవికి వరుణ్ చిన్నప్పటి నుంచీ వీరాభిమాని. చిరుకు సంబంధించిన కార్యక్రమాల్లోన్నింటిలోనూ వరుణ్ పాల్గొంటూనే ఉంటాడు. రీసెంట్‌గా చిరు 150వ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన రోజుకూడా వరుణ్ ఆ రోజంతా చిరుతోనే ఉన్న సంగతి తెలిసిందే.

English summary
Yesterday actor Varun Tej posted childhood photo of himself imitating Chiranjeevi’s pose from Gang Leader, on social networking site and tweeted,” Was trying to imitate Megastar from Gang leader
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu