»   » మెగాన్యూస్ : జేమ్స్ బాండ్ పాత్రలో ‘వరుణ్ తేజ్’

మెగాన్యూస్ : జేమ్స్ బాండ్ పాత్రలో ‘వరుణ్ తేజ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu
Varun Teja
హైదరాబాద్ : మెగా కుటుంబం నుంచి త్వరలో రాబోతున్న మరో కొత్త హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమాకు ఫైనల్‌గా క్రిష్ దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ క్యారెక్టర్‌ను జేమ్స్ బాండ్ రేంజిలో చూపెట్టనున్నట్లు తెలుస్తోంది.

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని తిరిగి తీసుకొచ్చే పాత్రలో జేమ్స్ బాండ్ లెవల్లో వరుణ్ తేజ్ పాత్ర ఉంటుంది. ఇప్పటికే క్రిష్ స్క్రిప్టు వర్క్ కూడా మొదలు పెట్టాడని, త్వరలో సినిమా పట్టాలెక్కబోతోందని అంటున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ఇటీవల వరుణ్ తేజ్ తెరంగ్రేటం చేయబోయే సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాథ్ అనుకున్నప్పటికీ తర్వాత క్రిష్‌ను ఫైనల్ చేసారు. ఈ మార్పు వెనక పవన్ కళ్యాణ్ కారణమని, పవన్‌పై పూరి జగన్నాథ్ ఆ మధ్య చేసిన వ్యాఖ్యల ఫలితమే అనే పుకార్లు షికార్లు చేసాయి.

అయితే తాజాగా తేలింది ఏమిటంటే.....పూరిని మార్చడం వెనక పవన్ కళ్యాణ్ ప్రమేయం లేదని తెలుస్తోంది. వేరే కారణాల వల్లనే పూరిని మార్చి క్రిష్‌ను ఎంపిక చేసారని అంటున్నారు. ఈ మార్పు వెనక కారణం వరుణ్ తేజ్‌ను వెండి తెరకు పరిచయం చేయబోయే నిర్మాత అశ్వినీ దత్ అనే అంటున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే....దర్శకుడు క్రిష్‌ ఇప్పటి వరకు తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ హిట్స్ ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో మరి వరుణ్ తేజను క్రిష్ ఎలాంటి కథాంశంతో లాంచ్ చేయబోతున్నారో? అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
If the sources from Filmnagar are to be believed, Naga Babu’s son Varun Tej will Debut with a James Bond like character. He plays a role which tries to unearth the black money in various foreign banks and bringing back to India and eradicating Poverty and hunger here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu