twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమతాన్ని నమ్ముకున్నోడే కమ్మోడు, కాపు కాసేవాడు కాపు ( 'కంచె ' వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : వరుణ్ తేజ హీరోగా చేస్తున్న కంచె చిత్రం ఈ నెల 22న అంటే రేపు విజయ దశమి సందర్బంగా విడుదల అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడటంతో సినిమాకు సంభందించిన ప్రమోషన్స్ ని ముమ్మరం చేసారు. అందులో భాగంగా డైలాగు ప్రోమోని వదిలారు. కులాల గురించి డైలాగుతో ఆ ప్రోమో సాగుతుంది. మీరూ చూడండి...

    కంచె విషయానికి వస్తే....మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయింది. ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "Absolute Telugu Cinemas" వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం జార్జియా గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్ డ్రాపుకు తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వండర్ ఫుల్ ఎఫర్టె పెట్టి పని చేసారు. రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన ఈ సినిమాకు చింతన్ భట్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మనకు చాలా మంది దర్శకులు ఉన్నా ఎందుకో రెండో ప్రపంచ యుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ భిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. చెప్పని కథలను చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్' అన్నారు.

    ఆ మధ్యన పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇదిగో...

    వరుణ్ తేజ్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నా టీమ్ అందరికీ దన్యవాదాలు. పండగరోజు అందరూ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. అభిమానులందరూ నా ప్యామిలీ. పెదనాన్న చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేను. మంచి సినిమా చేస్తున్నాను. నాన్న పరువు నిలబడెతాను. సినిమా విడుదలైన తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ కి చూపిస్తాను. సినిమా ఎలా ఉందని అడుగుతాను. అభిమానులు గర్వ పడేలా సినిమా ఉంటుంది. అన్నారు.

    అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్‌ చెప్పారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబా, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్‌భట్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్. అలాగే కొద్ది రోజుల క్రితం మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఇక్కడ ఆ వీడియోని చూడండి.

    సిరివెన్నెల మాట్లాడుతూ... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా మనల్ని 1945లోకి తీసుకెళ్తాయి. యుద్దంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలోని మనిషి దేని కొట్టుకుంటున్నాడో తెలియని దాన్ని యుద్ధం రూపంలో చెప్పడం, అందులోనే ప్రేమను కూడా చెప్పడం, ఈ మనిషి తాలూకు వైరుధ్యాన్ని చూపడం నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. వరుణ్ ని చూస్తుంటే హాలీవుడ్ నటున్నిచూసినట్లు ఉంది. రెండో సినిమాకే ఇలాంటి సినిమాలో అవకాశం దొరకడం అదృష్టం అన్నారు.

    రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అద్భుత ప్రేమ కథను మిళితం చేశామని దర్శకుడు క్రిష్‌ చెప్పారు. చిత్రంలో కనిపించే 1940ల నాటి దృశ్యాలు, యుద్ధ సన్నివేశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

    English summary
    Varun Tej, Krish's Kanche New Trailer releasded. The movie Releasing on October 22nd .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X