»   » తోడుగా ఉంటూ... వందమంది సైన్యంలా కాపాడే...వరుణ్ తేజ ( 'మిస్టర్' ట్రైలర్)

తోడుగా ఉంటూ... వందమంది సైన్యంలా కాపాడే...వరుణ్ తేజ ( 'మిస్టర్' ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మిస్టర్‌'. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), 'ఠాగూర్‌' మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో హీరోయిన్స్. తాజాగా..... ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారు. కాటమరాయుడు చిత్రానికి కలపటానికే ఈ ట్రైలర్ ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఈ మధ్య వరుస ప్లాపులతో కాస్త డౌన్ అయ్యాడు. 'మిస్టర్' సినిమాతో మళ్లీ రేంజి ఏమిటో చూపించడానికి సిద్ధమయ్యాడు. వరుణ్ తేజ్ ఇందులో పిచ్చయ్య నాయుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

Varun teja's Mister Theatrical Trailer

మెగా హీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాలో మిగితా సినిమాల కంటే భిన్నంగా.. లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. క్లాస్ ఆండ్ డీసెంట్ లుక్స్ తో కనిపిస్తూనే మాస్ ఫైట్లు కూడా చేసేస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ చూడగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

'జీవితం మనల్ని చాలా చోట్లకు తీసుకు వెళ్తుంది.. కాని ప్రేమ జీవితం ఉన్న చోటికి మాత్రమే తీసుకువెళ్తుంది' అంటూ వరణ్ తేజ చెప్పే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్కడు తోడుగా ఉంటే చాలు .. వందమంది సైన్యంలా కాపాడతాడంటూ.. లావణ్య త్రిపాఠి చెప్పే డైలాగ్‌తో పాటు.. మనం ఇష్టపడ్డ వాళ్లు మనకు దొరక్కపోతే ఆ బాధఎలా ఉంటుందో నాకు తెలుసు అని వరుణ్ తేజ్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

శ్రీను వైట్ల మాట్లాడుతూ ''నా కెరీర్‌లో ఇది స్పెషల్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఎమోషన్స్‌కి, విజువల్స్‌కి, మ్యూజిక్‌కి స్కోప్‌ ఉన్న సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా కథ కుదిరింది. అదే ఈ 'మిస్టర్‌'.

ఈ సినిమా కోసం చాలా చాలా ట్రావెల్‌ చేశాం. ముఖ్యంగా స్పెయిన్‌లోని అందమైన ప్రాంతాలు అర్కెంటే, బెనిడోరన్, లమంగా, సెవిల్లా, క్లాడిస్‌ బ్రిడ్జ్, వేజర్‌ వైట్‌ విలేజ్, టొలోరో, కాంబడాస్‌లలో చిత్రీకరణ జరిపాం. అలాగే స్విట్జర్లాండ్‌తో పాటు చిక్‌మంగళూరు, ఊటీ, హైదరాబాద్‌ పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో షూటింగ్‌ చేశాం. నా నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పూర్తి సహకారంతో నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను'' అని అన్నారు.

నాజర్, ప్రిన్స్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, 'సత్యం' రాజేష్, 'షకలక' శంకర్, నాగినీడు, హరీష్‌ ఉత్తమన్, నికితిన్‌ దీర్, షఫి, శ్రావణ్, శతృ, మాస్టర్‌ భరత్, షేకింగ్‌ శేషు, ఈశ్వరరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్‌ సీపాన, స్టైలింగ్: రూపా వైట్ల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కి జె.మేయర్, కెమేరా: కె.వి. గుహన్, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, కో-డైరెక్టర్స్‌: బుజ్జి, కిరణ్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కొత్తపల్లి మురళీకృష్ణ, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), 'ఠాగూర్‌' మధు, సమర్పణ: బేబీ భవ్య, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
The official trailer of Mega prince Varun Tej’s most awaited flick ‘Mister’ released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu