»   »  నయనతార ఇండిపై దాడి చేస్తాం..నాకేం సంబంధం లేదు బాబోయ్ అంటున్న నయన్!

నయనతార ఇండిపై దాడి చేస్తాం..నాకేం సంబంధం లేదు బాబోయ్ అంటున్న నయన్!

Subscribe to Filmibeat Telugu

నయనతార కొన్ని వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె ప్రేమ వ్యవహారాలు అప్పుడప్పుడూ మీడియాలో ప్రధానాంశాలుగా మారుతుంటాయి. వృత్తి పరంగా నయన్ పై ఎటువంటి రిమార్క్ లేదు. తన పని తాను చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతుందని టాక్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉంది. నయనతార తొలిసారి వృత్తి పరంగా వార్తల్లో నిలిచింది. నయన్ నటించిన వాసుకి చిత్ర విడుదల విషయంలో వివాదం నెలకొంది.

Vasuki movie release issue became hot topic

ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార పుదియ నియమం అనే మలయాళీ చిత్రంలో నటించింది. ఆ చిత్రాన్ని వాసుకి పేరుతో తమిళంలోకి అనువదించి విడుదల చేసారు. తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం బంద్ పాటిస్తుంటే నయనతార చిత్రానికి మాత్రం ఏంటి ఈ మినహాయింపు అని నిర్మాతలు కొందరు మండి పడుతున్నారు. నయన్ ఇంటిని ముట్టడించి దాడికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. వాసుకి చిత్ర విడుదలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నయన్ చెబుతోంది. అది పూర్తిగా నిర్మాతల నిర్ణయం అని నయన్ అంటోంది. దీనికి తనని భాద్యురాలిని చేయడం ఏంటని నయన్ తన వాదన వినిపిస్తోంది.

English summary
Nayanthara lands in controversy. Vasuki movie release issue became hot topic
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X