Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్లీజ్ అంటూనే గట్టిగా ఇచ్చిపడేశాడు.. తప్పుడు వార్తలపై సింగర్ హేమచంద్ర ఫైర్
సింగర్ హేమచంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గాత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. హేమచంద్ర స్టేజ్ ఎక్కితే ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఓ వైపు పాటలు పాడటమే కాదు సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉంటాడు. సోషల్ మీడియలోనూ యాక్టివ్‌గానూ ఉంటూ పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ సీరియస్ అవ్వని హేమచంద్ర తాజాగా కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవిలు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అన్యోన్యదాంపత్యానికి వీరిద్దరూ ఉదాహరణలుగా నిలుస్తారు. బయట షోలో ఎంత ఫన్ క్రియేట్ చేస్తారో ఇంట్లోనూ అంతే సరదాగా ఉంటారు. ఈ మధ్యే శ్రావణ భార్గవి పుట్టిన రోజు సందర్భంగా హేమచంద్ర స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. మొదట దిగిన ఫోటో దగ్గరి నుంచి అన్ని విషయాలను పూసగుచ్చినట్టు గుర్తు చేశాడు.

డబ్బింగ్‌లో సూపర్..
హేమచంద్ర వాయిస్ వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అయితే కొంత మందికి అది హేమచంద్ర వాయిస్ అని తెలియకపోవచ్చు. ఆయన అభిమానులకు, ఫాలో అయ్యే నెటిజన్లకు మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. తెలుగులో స్టైలీష్ విలన్లకు, బయటి నుంచి వచ్చే కొత్త విలన్లు వాయిస్ అందించేది మన హేమచంద్రనే.

అందరికీ హేమచంద్రే..
ధృవ సినిమాలో అరవింద్ స్వామికి, అశ్వథ్థామ చిత్రంలో కొత్త విలన్‌కు ఇలా ప్రతీ ఒక్క ప్రతినాయకుడికి గాత్రాన్ని అందించేది హేమ చంద్రనే. సవ్యసాచి చిత్రంతో మాధవన్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు కూడా డబ్బింగ్ చెప్పింది హేమచంద్రనే. తాజాగా వచ్చిన నిశ్శబ్దంలోనూ డబ్బింగ్ చెప్పింది హేమచంద్రనే. మాధవన్ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సూట్ అవ్వడంతో మళ్లీ హేమచంద్రతోనే డబ్బింగ్ చెప్పించారు.

తప్పుడు రిపోర్టింగ్..
అయితే ఈ విషయాలన్నీ తెలియని ఓ రిపోర్టర్.. ఓ పేపర్‌తో తప్పుగా రాశాడు. మాధవన్ సొంతంగా తెలుగు నేర్చుకుని సవ్యసాచిలో డబ్బింగ్ చెప్పాడని, మళ్లీ నిశ్శబ్దంలోనూ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పాడని రాశారు. ఈ వార్త హేమచంద్ర కంటపడింది.
Recommended Video

రాసేముందు..
హేమ చంద్ర ఫ్యాన్స్ కొందరు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని చెబుతూ.. రాసిన రిపోర్టర్ ఎవరైనా సరే.. దయచేసి రాసే ముందు కాస్త హోం వర్క్ చేయాలి అంటూ సెటైర్ వేశాడు. ఇక ఫ్యాన్స్ చేస్తున్న పోస్ట్‌లకు స్పందిస్తూ.. నాకు తెలిసి అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు అని చెప్పుకొచ్చాడు. ఇలా తన కష్టాన్ని వేరే వారి ఖాతాలో వేస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. హేమచంద్ర కూడా అలానే హర్ట్ అయి ఉంటాడు.