»   » డిఫెరెంట్ :'ఉపేంద్ర 2' అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

డిఫెరెంట్ :'ఉపేంద్ర 2' అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్నేళ్ల క్రితం ఉపేంద్ర హీరోగా నటించిన ఉపేంద్ర చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కన్నడంలో ఉప్పి-2 పేరుతో ఓ చిత్రాన్ని ఉపేంద్ర నటిస్తూ రూపొందిస్తున్నారు. పారుల్ యాదవ్, క్రిష్టినా అకీవా హీరోయిన్స్ గా నటించారు.

 Vedio:Official trailer of the movie Upendra 2

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను ఉపేంద్ర-2 పేరుతో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలుగులో అందిస్తున్నారు. ఈ నెలలోనే కన్నడం, తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆడియో పంక్షన్ చేసి, అఫీషియల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఎప్పటిలాగే డిఫెరెంట్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ని మీరూ ఇక్కడ చూడండి.

నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ మాట్లాడుతూ.... నా సినీ కెరీర్ ఉపేంద్ర నటించిన రా సినిమాతో మొదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఆయనతో సినిమా తీసే అవకాశం లభించింది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులో ఆగస్టు 14న విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భవ్య, కెమెరా: అశోక్ కశ్యప్, సంగీతం: గురుకిరణ్.

English summary
Upendra 2 Official Trailer featuring Upendra and Kristina Akheeva in lead roles. Music composed by Gurukiran,. Directed by Upendra, Editing by Sree and produced by Nallamalupu Bujji under the banner of Lakshmi Narasimha Productions. It is a sequel to his 1999 film Upendra and is being produced under his production company Upendra Productions.The film is slated for release on 14 August 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu