Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Veera Simha Reddy: శ్రుతి హాసన్ పరువు తీసిన డైరెక్టర్.. నా ప్రేమ ఆమె లాంటిది కాదంటూ ఘోరంగా!
నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉండనున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి నెలలోనే సంక్రాంతి కానుకగా తన సినిమాతో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరి సింహా రెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న విడుదల కాగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగానే జనవరి 6న అంటే ఇవాళ ఒంగోలులో చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రుతి హాసన్ పై షాకింక్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.

ఇద్దరు ఫుల్ జోష్ తో..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో, గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బాలకృష్ణ అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ తో అభిమానుల చేత ఉర్రూతలూగించాడు. ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

కొద్ది రోజుల ముందు..
ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక వీర సింహా రెడ్డి సినిమా ట్రైలర్ తర్వాత మరో మాస్ నెంబర్ మాస్ మొగుడు పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుండగా కొద్ది రోజుల ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఒక 25 మంది సినిమా చూసేందుకు..
"ఇదిలా ఉంటే ఒంగోలులో నిర్వహించిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ పై ఈ సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. 1999లో ఒంగోలులో సమర సింహా రెడ్డి సినిమా చూడాలని చెప్పి.. 18 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 25 మంది సినిమా చూడాలని వచ్చారు. ఆ 25 మంది కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వేల మంది ఫ్యాన్స్ మీరు ఎలా ఉన్నారో.. అప్పుడు నేను కూడా ఒక ఫ్యాన్ లా సినిమా చూశాను" అని గోపిచంద్ తెలిపాడు.

ఒక కంటితో ఫ్యాన్ లా..
"ఒక బాలయ్య బాబు ఫ్యాన్.. ఈరోజు ఒక బాలయ్య బాబు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు అంటే.. జీవితానికి ఇంకేం కావాలి. లైఫ్ లో ఇలాంటి అవకాశం ఎవరికీ రాదు. కోట్ల మందిలో ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఒక ఫ్యాన్ కి.. ఒక మాస్ గాడ్ ని.. డైరెక్ట్ చేసే అవకాశం రావడం మాములు విషయం కాదు. బాలయ్య బాబును ఒక కంటితో డైరెక్టర్ లా చూస్తున్నా.. రెండో కంటితే ఫ్యాన్ లా చూస్తున్నా. ఒక ఫ్యాన్ కు బాలయ్య బాబును ఎలా చూపించాలి అనే ఆలోచనతో మురిసిపోతూ రోజూ చూశా. అది నేను మాటల్లో చెప్పుకోలేను" అని డైరెక్టర్ పేర్కొన్నారు.

మా బావ తమన్ నీ గురించే..
"శ్రుతి హాసన్ తో ఇది మూడో సినిమా. అద్భుతమైన నటి. నాకు లక్కీ హీరోయిన్. శ్రుతి హాసన్ కామెడీ టైమింగ్, డ్యాన్స్ మొత్తం ఇరగదీస్తది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రుతి.. ఐ లవ్యూ శ్రుతి. ఈ సినిమాలో మరొక మంచి క్యారెక్టర్ చేసింది హనీ రోజ్. మా బావ తమన్ మ్యూజిక్ చేస్తూ నీ గురించి గొప్పగా చెబుతున్నాడు. చాలా బాగుంది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని అన్నాడు. అలాగే సాండల్ వుడ్ సలగ.. కన్నడలోనే పెద్ద హీరో దునియా విజయ్ అన్న. బాలకృష్ణ సినిమా కోసం అడగ్గానే ఒప్పుకున్నాడు" అని తెలిపాడు డైరెక్టర్ గోపిచంద్.

తల దించుకున్న శ్రుతి హాసన్..
"నా టీమ్ మొత్తం, నా డైరెక్షన్ టీమ్ మొత్తం నాకు అండగా నిలబడ్డారు. వీళ్లంతా బాలయ్య బాబు ఫ్యాన్స్. బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా కలిసి సినిమా చేస్తే అది వీర సింహా రెడ్డి. బాబు.. ఐ లవ్యూ బాబు. శ్రుతి హాసన్ చెప్పిన లవ్ కాదు బాబు ఇది. ఈ ప్రేమ మనసులో నుంచి వచ్చిన లవ్వు. ఒక ఫ్యాన్ లవ్వు ఇది. బాలయ్య బాబుని ఒక ఫ్యాన్ ఎంత ఇష్టపడితాడో అదే ప్రేమ బాబు ఇది" అని గోపిచంద్ అన్నాడు. గోపిచంద్ తన గురించి అలా చెప్పడంతో శ్రుతి హాసన్ తలదించుకుని నవ్వేసింది.