»   » దిల్‌రాజు రెడీ: వెళ్ళిపోమాకే సినిమా రిలీజ్ డేట్ ఖరారు

దిల్‌రాజు రెడీ: వెళ్ళిపోమాకే సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీంకు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన వెళ్ళిపోమాకే చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.

వెళ్ళి పోమాకే సినిమా మేకింగ్ చాలా బాగా న‌చ్చిందని, మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశాడని, దానికి తగిన విధంగా నటీనటులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారని దిల్ రాజ్ అన్నారు.

Velli Pomake film will be released on Sept 2
Dil raju's "VELLIPOMAKE" Movie Release Date Fixed.

విశ్వక్ సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య సాగే ఫీల్ గుడ్ మూవీ యాకూబ్ అండ్ టీం క‌లిసి, కొత్త‌గా చేసిన ప్ర‌య‌త్నమే వెళ్ళిపోమాకే. దర్శకుడు న‌టీన‌టుల నుండి పెర్‌ఫార్మెన్స్‌ ను రాబ‌ట్టుకున్న తీరు బాగా న‌చ్చిందని ఆయన అన్నారు.

హీరో విశ్వ‌క్ సేన్ అనుప‌మ్ ఖేర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడని, అలాగే డైరెక్ట‌ర్ యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో శిక్ష‌ణ తీసుకున్నాడని చెప్పారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ స్కూల్‌లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడని అన్నారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ తో వ‌స్తున్న యంగ్ టీంను ఎంక‌రేజ్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వస్తాయని, సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నామని అన్నారు.

Velli Pomake film will be released on Sept 2

ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ - ఈ సినిమాను రెండున్న‌ర సంవ‌త్స‌రాల క్రిత‌మే స్టార్ట్ చేశాం. నాకున్న బ‌డ్జెట్ ప‌రిమితుల్లో, వ‌న‌రుల‌తో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా న‌చ్చి దిల్‌ రాజుగారు సినిమాను విడుద‌ల చేద్దామ‌నే ఉద్దేశంతో ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

English summary
Tollywood producer Dilraju is releasing Yakoob Ali's film Velli Pomake on September2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu