For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మామా అల్లుళ్లు అదరగొట్టేశారు.. అల్లుడికి ఆట, వేట నేర్పించిన మామ..

  |
  Venky Mama First Glimpse

  మల్టీ స్టారర్ చిత్రాలకు వెంకటేష్ మంచి సహాకారం అందిస్తుంటారు. కథ నచ్చితే ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అంటారు. వేరే హీరో ఎవరున్నా.. వెంకటేష్ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. మసాలా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2 చిత్రాలు మల్టీ స్టారర్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి..

  వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాకు అరుదైన గౌరవం.. తెలుగు నుంచి ఈ ఒక్కటే

  గురుతో సోలో హిట్

  గురుతో సోలో హిట్

  విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ రాలేదు. రీమేక్ గా వచ్చిన గురు సినిమాతో సోలో హిట్ కొట్టేశాడు.అయితే మళ్లీ మరో హిట్ కొట్టేందుకు చాలా సమయమే పట్టింది. అందుకే సోలోగానే కాకుండా వేరే హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దపడ్డాడు.

  ఎఫ్2తో తిరుగులేని హిట్..

  ఎఫ్2తో తిరుగులేని హిట్..

  నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ చిత్రాల్లో వెంకీ పంచిన కామెడీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. మళ్లీ అలాంటి వెంకీని చూడలనుకున్న వెంకీని ఎఫ్2 చిత్రంతో చూశేశారు. చాలా ఏళ్ల తరువాత కడుపుబ్బా నవ్వించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

  మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్..

  మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్..

  టాలీవుడ్ లో మల్టీ స్టారర్కు వెంకటేష్ కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. వెంకటేష్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈజీగా రీచ్ కావొచ్చు.. మిగతా హీరోలతో కంఫర్ట్ గా ఉండే వెంకీ.. కథను నమ్మడం.. సినిమాలకు ఓకే చెప్పడంతో మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలు పట్టాలెక్కుతున్నాయి.

  రియల్ లైఫ్ క్యారెక్టర్స్.. రీల్ లైఫ్ క్యారెక్టర్స్

  రియల్ లైఫ్ క్యారెక్టర్స్.. రీల్ లైఫ్ క్యారెక్టర్స్

  నిజ జీవితంలో మామా అల్లుళ్లైన వెంకటేష్, నాగచైతన్య మొదటి సారి.. వెండితెరపై వారి పాత్రల్లోనే కనిపించనున్నారు. సినిమాలో కూడా వీరు మామాఅల్లుళ్ల పాత్రలనే చేయడంతో వెంకీ, అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి.

  తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్

  జై జవాన్ జై కిసాన్ అంటూ చూపించడంతోనే ఈ సినిమా థీమ్ ఏంటన్నది తెలిసిపోతోంది. అల్లుడు ఆర్మీలో పనిచేస్తుండగా.. మామా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడని అర్థమవుతోంది. గోదారిలో ఈత నేర్పించా.. వరిలో ఆట నేర్పించా.. జాతరలో వేట నేర్పిస్తా అనివెంకీ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. విజువల్స్ కూడా సూపర్భ్ గా ఉన్నాయి. చివర్లో తనశైలిలో కామెడీతో నవ్వించాడు.

  సురేష్ ప్రొడక్షన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  English summary
  Venkatesh And Naga Chaitanya Venkymama Movie First Glimpse Released. On dasara occasion Unit Released For Fans. And Now It Attracts fans, Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X