»   » చిరూ సినిమాలో వెంకీ : ఉయ్యాలవాడలో వెంకటేష్ రోల్ కన్‌ఫర్మ్ ?

చిరూ సినిమాలో వెంకీ : ఉయ్యాలవాడలో వెంకటేష్ రోల్ కన్‌ఫర్మ్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గురు వెంకీ రీసెంట్ స్టేట్మెంట్ గుర్తుంది కదా..! "చిరంజీవి 150వ చిత్రంలోనే ఓ చిన్న రోల్ లో అయినా నటిద్దామని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. వీలైతే మెగా 151లో చిన్న పాత్రయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా" అంటూఊ వెంకీ చెప్పగానే అవాక్కయ్యారంతా. అగ్ర హీరోలలో ఒకడైన వెంకీ ఎప్పుడూ లేని పోని భేషజాలకు పోడు, తనకంటూ ఉన్న ఇమేజ్ ని కాపాడుకుంతూనే తోటి హీరోల తోకలిసి మల్టీస్టారర్లు చేయటానికి కూడా వెనకడుగు వేయని తత్వం వెంకటేష్ సొంతం.

ఓవైపు సుకుమార్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన రామ్ చరణ్ మైండ్ లో సేమ్ టైం మరో మూవీ కూడా కదలాడుతోంది. అదే చిరు 151వ సినిమా. ఖైదీ నంబర్ 150కు నిర్మాతగా వ్యవహరించిన చెర్రీ, ఈ సినిమాను కూడా తనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఖైదీ నంబర్ 150 టైమ్ లో నెరవేరని ఓ కోరికను.. చిరు 151వ సినిమాతో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు.

Venkatesh Cameo In Chiranjeevi Uyyalavada Narasimha Reddy

నిజానికి ఉయ్యాలవాడలో ఓ కీలక పాత్ర గురించి.. వెంకటేష్ తో అంతకు మునుపే చర్చించాడట రామ్ చరణ్. అప్పట్లో ఖైదీ నంబర్ 150మూవీలో టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ స్టెప్స్ వేయించాలని ప్రయత్నించాడు మెగా పవర్ స్టార్. అయితే వెంకీతో మాత్రం సినిమాలో మంచి కీలకమైన ఓ రోల్ చేయించాలని అనుకున్నా.. స్క్రిప్ట్ లో అవకాశం లేదు.

ఇప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరట అటు చరణ్ ఇటు వెంకీ కూడా ఉయ్యాలవాడ సబ్జెక్టులో వెంకటేష్ కు సరిగ్గా సరిపోయే పాత్ర ఒకటి ఉందని తెలుస్తోంది. దాని గురించి ఇప్పటికే వెంకీ-చెర్రీలు డిస్కస్ చేయడం.. త్వరలో డెసిషన్ చెబుతానని వెంకీ అనడం జరిగాయట. అఫీషియల్ గా కాకపోయినా ఉయ్యాలవాడలో తానూ నటిస్తున్నట్లు ఇన్ డైరెక్టుగా అనౌన్స్ చేయటానికే ఈ వ్యాఖ్యలు చేసాడని అనుకోవచ్చు.

English summary
Chiru and Ramcharan wanted Venky to play a guest role in Khaidi No 150 but it did not turn up. We have to wait and see if Venkatesh gets convinced for the assigned role in Uyyalavada Narasimha Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu