»   » వెంకటేష్, తేజ సినిమాపై గుసగుసలు.. కారణం అదేనట..

వెంకటేష్, తేజ సినిమాపై గుసగుసలు.. కారణం అదేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గురు సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్ మరో సినిమాకు చాలానే గ్యాప్ తీసేసుకున్నాడు. గురు అనంతరం అచితూచీ అడుగువేస్తూ దర్శకుడు తేజతో వెంకీ జతకట్టాడు. కానీ ఆ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సింది. అయితే ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నదనే వార్త సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్ర కథ, స్క్రిప్టు విషయంలో వెంకటేష్ కొంత అసంతృప్తిగా ఉన్నాడట. అంతేకాకుండా పలు రకాల మార్పులు, చేర్పులను తేజకు సూచించినట్టు సమాచారం. దీంతో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

వెంకటేష్ మార్పులతో తేజ కథ, స్కిప్టుపై పునరాలోచనల పడినట్టు సమాచారం. దీంతో వెంకీ సినిమా మరింత ఆలస్యమవుతుందనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీయా సరన్ ఎంపిక చేశారు. ఇంతలో ఈ ముద్దుగుమ్మ రష్యా పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అత్తారింటికి చెక్కేయడం కూడా కొంత ఇబ్బందిగా మారింది.

Venkatesh movie: Teja making some changes in script

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకటేష్ చిత్రాన్ని మే నెలలో షూటింగ్ వెళ్లే ఆలోచనతో తేజ ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. ఈ లోపు ఎన్టీఆర్ బయోపిక్ ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

English summary
After Guru success, Venkatesh is planning to do a movie with Director Teja. They came to understanding about Shriya Saran as heroine. Director Teja is getting ready for shoot this movie. Meanwhile, Hero Venkatesh not happy with the way script come out. He given some changes for Teja for their project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X