»   »  నాగ చైతన్య సినిమాలో నాగ్-వెంకీ అతిథి పాత్రలో?

నాగ చైతన్య సినిమాలో నాగ్-వెంకీ అతిథి పాత్రలో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య, ఆ సినిమా తర్వాత మళయాల హిట్ మూవీ ‘ప్రేమం' తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ల నుంది.

తెలుగులో ఈ చిత్రాన్ని ‘మజ్నూ' పేరుతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మళయాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

Venkatesh and Nagarjuna to do cameo roles in Nagachaitanya movie

ఇందులో నాగార్జున, వెంకటేష్ లు అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి, మేనమామలతో కలిసి నాగ చైతన్య కలిసి కనిపిస్తే సినిమాపై అంచనాలు భారీగా ఉండటం ఖాయం. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమా వివరాల్లోకి వెళితే...
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రోడ్డుపై బైక్ ఉండటాన్ని బట్టి ఇదొక అడ్వెంచరస్ రోడ్ ట్రిప్పుకు సంబంధించిన కాన్సెప్టుతో సాగుతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో హీరో రానా కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు ఫిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

English summary
Film Nagar source said that, Venkatesh and nagarjuna to do cameo roles in Nagachaitanya movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu