»   »  చిరు కు పోటీగా గురు, 400 థియేటర్లు పోయినట్టే... ఎంతపని చేసావ్ వెంకీ...!!

చిరు కు పోటీగా గురు, 400 థియేటర్లు పోయినట్టే... ఎంతపని చేసావ్ వెంకీ...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి ప్రతీ ఏటా వచ్చే ఈ పందుగ ఒకప్పుడు పంటల పండుగగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాలలో సినిమా పడుగ గా మరింది.ఎప్పటి మాదిరే ఈ రాబోయే సంక్రాంతికి కూడా అందరు హీరోలూ పోటీ పడనున్నారు. చిరు, బాల కృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జునా... ఇలా డిసెంబర్నుంచి మొదలై మార్చి వరకూ వరుసపెట్టి అగ్రహీరోల సినిమాలు రానున్నాయి.

అన్నిటికంటే ముఖ్యంగా అటు ఖైదీనెం.150 ఇటు గౌతమీ పుత్ర శాతకర్ణి లమీదే అందరి దృష్టీ నిలిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ రెండుసినిమాలకీ దేనిప్రత్యేకత దానికేఉంది. దాదాపు దశాబ్దం దగ్గరలో గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్ళీ వస్తున్న సినిమా ఖైదీ కాగా, బాలయ్య తన శతసినిమాల టార్గెట్ ని చేరుకున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి, తెలుగు సినిమా చరిత్రలో ఈ రెండు సినిమాలూ అత్యధిక ప్రధాన్యతను సంతరించుకున్నవే. అయితే ఈ రెండు మైలు రాళ్ళలో ఏ సినిమా నిలబడుతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చిరుకి ఒక షాక్ గట్టిగానే తగిలేలాఉంది. ఈ షాక్ ఇచ్చేది విక్టరీ వెంకటేష్ కావటం గమనార్హం... వెంకీ తీసుకున్న ఒక నిర్ణయం తో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు ఏకంగా 400 థియేటర్లను చిరు వదులుకోవాల్సి ఉంటుంది.. ఇలా జరిగితే మాత్రం ఖైదీ చిక్కుల్లో పడ్డట్టే..

 అందరి ఫోకస్ అటే:

అందరి ఫోకస్ అటే:


నిజానికి నలుగురు హీరోల సినిమాలైనా అందరి ఫోకస్ మాత్రం చిరు, బాలయ్యల సినిమాలమీదే ఉంది. ఈ పోటీలో దూరతం ఇష్టం లేకే నాగార్జునా, వెంకటేష్ తమ సినిమాలని కొన్నాళ్ళు ముందో వెనకో రిలీజ్ చేద్దామనుకున్నారు. బోతున్న సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణల వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన రేస్ గా మారిపోవడంతో మెగా నందమూరి వార్ కు సంబంధించి రోజుకు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చే వార్తలు బయట పడుతున్నాయి..

 అన్ని రకాల రికార్డులలో:

అన్ని రకాల రికార్డులలో:


ఇక ఇప్పుడు చిరు విషయానికి వస్తే ఓపెనింగ్స్ ఎక్కువ గౌతమీ పుత్రుడే కొట్టేస్తాడేమో అన్న అనుమానం మొదలయ్యింది. అసలే మెగా కాంపౌండ్ సుధీర్గ విరామం తర్వాత చిరు నటిస్తున్న చిత్రాన్ని అన్ని రకాల రికార్డులలోనూ ముందు కు తేవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు చిరు కి ఊహించని షాక్ తగిలేలా ఉంది. అదేమిటంటే... "గురు" గా రాబోతున్న విక్టరీ వెంకటేష్ కూడా ఖైదీ నెం. 150 రోజే తన సినిమాని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాడట... అసలు ఈ సినిమా వల్ల నిజంగా చిరుకి కష్తమేనా అంటే..... ఒక సారి ఈ వివరాలు చూడండి...

 చిరంజీవి 150 వ చిత్రం:

చిరంజీవి 150 వ చిత్రం:


తెలుగు ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం మొత్తాలనికి పట్టాలెక్కింది. చిరంజీవి రాజకీయాల్లో కి వెళ్లిన తర్వాత దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత ఆయన తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రం రీమేక్ పూర్తిగా తెలుగు నేటివిటీకి తగినట్లుగా తీస్తున్నారు. మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెం.150'చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

 బోగి రోజున:

బోగి రోజున:


అయితే ఈ చిత్రం సంక్రాంతి బరిలో దింపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ముందునుంచి చెబుతున్నా ఆ మద్య సమ్మర్ కి షిఫ్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి.కాగా దీనిపై చిత్ర యూనిట్ ఇప్పుడు ఓ క్లారిటీ ఇచ్చింది.ఇప్పటికే 70 శాతంపైగా చిత్రీకరణ జరుపుకున్న 'ఖైదీ నెం 150' చిత్రాన్ని అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా ఒక్క రోజు ముందు అంటే బోగి రోజున విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ కొణిదెలా ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

 ప్రతీ విషయం లోనూ:

ప్రతీ విషయం లోనూ:


ఈ నేపథ్యం లో ఈసారి వచ్చే సంక్రాంతి కేవలం అభిమానుల కు మాత్రమే కాదు ప్రతీ తెలుగు సినిమా ప్రేక్షకుని చూపూ ఈ రెండుసినిమాలవైపే అయితే ఇప్పుడు గెలుపు అవకాశాలే కాదు ప్రతీ విషయం లోనూ అతి జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి ఈ రెండు సినిమా యూనిట్లు కూడా. ఏ ఒక్క అంశాన్నీ తేలిగ్గా తీసుకోవటం లేదు. ఎవరికి వారు తమదే పై చేయి అనిపించుకోవాలన్నంత తపనతోఉన్నారు.

ప్రధానాంశం ఇదే:

ప్రధానాంశం ఇదే:

ఇప్పుడు కొన్ని పాయింట్లు మరీ ఎక్కువగా కాదుగానీ ఒకింత ఆందోళన గానే ఉన్నాయి. విజయం మీద ఏ అనుమానమూ లేదు ఖచ్చితంగా ఈ రెండు సినిమాలూ విజయం సాధించే తీరుతాయి కానీ ఏ విశయం లో ఎవరు పై చేయిగా నిలబడతారన్నదే ఇక్కడ ప్రధానాంశం... ఇప్పటికే ‘ఖైధీ నెం 150' మూవీ కోసం నిర్మాతలు అత్యధిక థియేటర్స్ ని సేకరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 ఒక్కసారిగా 400 థియేటర్లు:

ఒక్కసారిగా 400 థియేటర్లు:


అయితే సంక్రాంతికి అత్యధిక సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటన్నింటి కంటే ‘ఖైధీ నెం 150' మూవీ చిత్రానికే ఎక్కువ థియేటర్స్ సంపాదించుకోవాలనేది నిర్మాతల తపన. అయితే ఇప్పుడు ఈ ప్రయత్నానికి గండి పడేలానే ఉంది... ఒక్కసారిగా 400 థియేటర్లు చేతినుంచి జారిపోనున్నాయి.. ఇంతకీ ఏం జరుగుతోందంటే....

 తప్పుకున్నాయనే అనుకున్నారు:

తప్పుకున్నాయనే అనుకున్నారు:


ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సంక్రాంతికి ‘ఖైధీ నెం 150' చిత్రం, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు మాత్రమే పెద్ద చిత్రాలుగా ఉన్నాయి. నాగార్జున, వెంకటేష్‌ చిత్రాలు సంక్రాతి పండుగ నుండి తప్పుకున్నాయనే అనుకున్నారంతా. అయితే తాజాగా వెంకటేష్‌ తన గురు చిత్రంని ‘ఖైధీ నెం 150'చిత్రం విడుదల రోజే విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గురు చిత్రం కారణంగా చిరంజీవి తాజాగా 400 థియోటర్స్ వరకూ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

థియేటర్స్ అన్నీ గురు చిత్రానికే:

థియేటర్స్ అన్నీ గురు చిత్రానికే:

‘ఖైధీ నెం 150', గురు చిత్రాలు ఒకే రోజు కావటంతో...సురేష్‌ ప్రొడక్షన్స్ చేతిలో ఉన్న థియేటర్స్ అన్నీ గురు చిత్రానికి కేటాయించటం జరిగింది. అందుకే మెగాస్టార్ కి భారీగా థియోటర్స్ సంఖ్య తగ్గిందని అంటున్నారు. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న ‘ఖైధీ నెం 150', గురు, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు ఏ విధమైన సక్సెస్ ని సాధిస్తాయో అనేది ఆసక్తిగా మారింది.

 ఓపెనింగ్స్ ఎక్కువ:

ఓపెనింగ్స్ ఎక్కువ:


రాబోతున్న సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణల వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన రేస్ గా మారిపోవడంతో మెగా నందమూరి వార్ కు సంబంధించి రోజుకు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చే వార్తలు బయట పడుతున్నాయి.. ఇక ఇప్పుడు చిరు విషయానికి వస్తే ఓపెనింగ్స్ ఎక్కువ గౌతమీ పుత్రుడే కొట్టేస్తాడేమో అన్న అనుమానం మొదలయ్యింది.ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం..

 తెలుగు ప్రజల చక్రవర్తి :

తెలుగు ప్రజల చక్రవర్తి :


ఇప్పటికే ఈ ప్రయత్నాలకు సంబంధించి పనులను ‘శాతకర్ణి' యూనిట్ ప్రారంభించినట్లు టాక్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి' తెలుగు ప్రజల చక్రవర్తి కాబట్టి అదీ కాకుండా ఆయన ఆరోజులలో పరిపాలించిన అమరావతి నేటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ఈ మినహాయింపు ఇవ్వడం ఏ మాత్రం కష్ట సాధ్యమైన పనికాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 స్పెషల్ స్క్రీనింగ్:

స్పెషల్ స్క్రీనింగ్:


ఈ ఎత్తుగడలకు అనుగుణంగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత ఈసినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అదేవిధంగా ఆయన మంత్రివర్గ సహచర్లకు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్క్రీనింగ్ తరువాత ఈసినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వవలసిందిగా క్రిష్ చేత అభ్యర్ధన చేయించడానికి రంగం సిద్ధం అయినట్లు టాక్.

 మొదటి రోజు నుండే :

మొదటి రోజు నుండే :


అయితే ఈ వార్తలే నిజం అయితే కలక్షన్స్ రికార్డులకు సంబంధించి ఈ రెండు సినిమాలకు వచ్చిన నెట్ కలక్షన్స్ రికార్డులలో ‘ఖైదీ నెంబర్ 150' కంటే నెట్ కలక్షన్స్ రికార్డుల విషయంలో బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైన మొదటి రోజు నుండే ఈ సంక్రాంతి రేసులో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే అవకాశం ఉంది.అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

English summary
According to sources, the final schedule of the film will be shot in Vishakapatnam for 9 days. It is said that the fish market scenes involving Venkatesh and Ritika Singh will be filmed in this schedule. It is also said that the film is being planned to release for the Sankranti festival
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu