»   » విజయవాడలో వెంకటేష్ 'నాగవల్లి' చిత్రం ఆడియో రిలీజ్

విజయవాడలో వెంకటేష్ 'నాగవల్లి' చిత్రం ఆడియో రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్, అనూష్క, కమిలిని ముఖర్జీ కాంబినేషన్ లో రూపొందుతున్న నాగవల్లి ..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో నవంబర్ 14 న విజయవాడ సిటిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ పంక్షన్ జరిగే వెన్యూగా సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజేని ఎంపిక చేసారని తెలుస్తోంది. పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ..కన్నడంలో ఘన విజయం సాధించిన ఆప్త రక్షక కు రీమేక్. రజనీకాంత్...చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్. ఇక ఈ చిత్రంలో లీడర్ ఫేమ్ రిచోపాధ్యాయ, శ్రధ్దా దాస్, పూనం కౌర్ కూడా కనపడనున్నారు. గురుకిరణ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu