»   » వెంకటేష్ కొత్త చిత్రం పూజ జరిగింది

వెంకటేష్ కొత్త చిత్రం పూజ జరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్, తేజ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభంకానున్న సావిత్రి చిత్రం పూజా కార్యక్రమాలు..ఆదివారం వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోలోజరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుంచి జరగనుంది. చిత్రం, నువ్వు నేను, జయం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించిన తేజ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రమిది. ఈ చిత్రంలో వెంకటేష్ చంటి తరహా అమాయకత్వం నిండిన పాత్రంలో కనిపంచనున్నట్లు సమాచారం. అలాగే షారూక్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం పాత్రనుంచి స్పూర్తి పొంది ఈ కథ తయారు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో త్రిషని హీరోయిన్ గా ఎంపిక చేసారు. గతంలో త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో నమో వెంకటేశ చిత్రం వచ్చి పరాజయం పొందింది. మరో ప్రక్క వెంకటేష్..త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం కూడా రెడీ అవుతోంది.

English summary
Director Teja will be making a comeback soon enough. His last film Keka, released about two years ago, was a disaster at the box office. The news is that Venkatesh has okayed Teja’s new film on principle. Tentatively titled Savitri, the film will roll shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu