»   » లహరి రిసార్ట్స్‌లో గడుపుతున్న వెంకీ, త్రిష

లహరి రిసార్ట్స్‌లో గడుపుతున్న వెంకీ, త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో వెంకటేష్, హీరోయిన్ త్రిష ప్రస్తుతం హైదరాబాద్ లోని లహరి రిసార్ట్స్ఖ్ లో గడుపుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న 'గంగా ది బాడీగార్డ్" సినిమా షూటింగ్‌లో భాగంగా ఇక్క వీరిపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో సలోని ముఖ్యమైన గెస్ట్ పాత్రలో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

మళయాలంలో ఇప్పటికే రూపొంది సూపర్ హిట్టయిన 'బాడీగార్డ్" సినిమాకు ఇది రీమేక్. తమిళంలో విజయ్-ఆసిన్ కాంబినేషన్ లో దీన్ని రీమేక్ చేస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా 'ది బాడీగార్డ్" పేరే దీన్ని రీమేక్ చేయగా ఇప్పటికే విడుదలైన బాక్సీఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తోంది. ఇందులో కరీనా కపూర్ లీడ్ హీరోయిన్ పాత్రలో చేస్తోంది.

చాలా కాలంగా పెద్దగా హిట్లు లేని వెంకీ తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశగా ఉన్నాడు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Venkatesh, Trisha are busy with their upcoming movie Ganga The Bodyguard at Lahari resorts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu