twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్టర్ మజ్నుని 'ఆరెంజ్‌'తో పోల్చుతున్నారేంటి.. దానితో పోల్చినా ఒక అర్థం ఉంది.. వెంకీ అట్లూరి!

    |

    మిస్టర్ మజ్నుగా అఖిల్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడిపింది. అఖిల్ సరసన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అఖిల్ ప్లే బాయ్ లుక్ లో అదరగొడుతున్నాడు. ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిస్టర్ మజ్ను ట్రైలర్ ని కొన్ని చిత్రాలతో పోల్చుతూ వస్తున్న కామెంట్స్ పై దర్శకుడు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    అఖిల్ పాత్రపై క్లారిటీ

    అఖిల్ పాత్రపై క్లారిటీ

    ట్రైలర్ టీజర్ చూసి ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ తరహాలో కనిపించబోతున్నాడని, అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియో అనుకుంటున్నారని వెంకీ అట్లూరి తెలిపాడు. కానీ అఖిల్ అలా చిత్రంలో కేవలం 20 నిముషాలు మాత్రమే కనిపిస్తాడని వెంకీ అట్లూరి తెలిపాడు. మిగిలిన కథ మొత్తం లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉందని తెలిపాడు. కానీ అఖిల్ ప్లే బాయ్ గా కనిపించడం వలనే ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ అండ్ రేటింగ్మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    ఆరెంజ్‌తో పోలిక

    ఆరెంజ్‌తో పోలిక

    ట్రైలర్ చూసి మిస్టర్ మజ్ను చిత్రాన్ని రాంచరణ్ ఆరెంజ్ చిత్రంతో పోల్చడంపై వెంకీ అట్లూరి స్పందించాడు. ఓపెన్ గానే మాట్లాడుకుందాం.. దీని గురించి నేను క్లారిటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మిస్టర్ మజ్ను ట్రైలర్, పోస్టర్స్ చూసి రాంచరణ్ ఆరెంజ్, రణబీర్ కపూర్ బచ్నా ఏ హసీనో చిత్రాలతో పోలుస్తున్నారు. వాళ్లకు ఎందుకు అలా అనిపించిందో అర్థం కావడం లేదని వెంకీ తెలిపాడు.

    దానితో పోల్చినా ఒక అర్థం ఉంది

    దానితో పోల్చినా ఒక అర్థం ఉంది

    మిస్టర్ మజ్ను చిత్రాన్ని రణబీర్ కపూర్ బచ్నా ఏ హసీనోతో పోల్చినా ఒక అర్థం ఉంది. ఎందుకంటే అందులో కూడా హీరో చాలా మంది అమ్మాయిలతో కనిపిస్తాడు. కాబట్టి మిస్టర్ మజ్ను కూడా కొంత అలా అనిపించి ఉండొచ్చు. కానీ ఆరెంజ్ తో ఎలా పోలుస్తున్నారో అర్థం కావడం లేదు అని వెంకీ తెలిపాడు. ఈ రెండు చిత్రాలతో మిస్టర్ మజ్ను చిత్రానికి ఏమాత్రం సంబంధం లేదని వెంకీ తెలిపాడు. పాత్రలు, కథ కథనం అంతా వేరుగా ఉంటాయి అని వెంకీ అట్లూరి క్లారిటీ ఇచ్చాడు.

    దిల్ రాజుకు నచ్చింది

    దిల్ రాజుకు నచ్చింది

    2011 లోనే మిస్టర్ మజ్ను కథ రాశానని వెంకీ అట్లూరి తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత ఈ కథని దిల్ రాజుకు చెప్పా. ఆయనకు నచ్చింది. కానీ ఈ కథని అనుభవం ఉన్న దర్శకుడు తెరక్కించాలని, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. కొంతకాలం నా వద్ద పనిచేయి, ఆ తర్వాత చేద్దాం అని చెప్పారు. ఈ లోపు తాను తొలిప్రేమ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని వెంకీ తెలిపాడు. ఈ కథ రాసుకున్న సమయంలోనే అఖిల్ హీరో, మిస్టర్ మజ్ను టైటిల్ అని ఫిక్స్ అయిపోయినట్లు వెంకీ తెలిపాడు.

    English summary
    Venky Atluri responds on Mister Majnu comparision with Ram Charan Orange movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X