For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ’కింగ్ ఆఫ్ రొమాన్స్’ యష్ చోప్రా కన్నుమూత

  By Srikanya
  |

  ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత యష్ చోప్రా ఆదివారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. షారుఖ్ ఖాన్ తో తీసిన జబ్ తక్ హై జాన్ ఆయన చివరి చిత్రం. యశ్‌చోప్రా మృతిపై పలువురు స్పందించారు. చోప్రా భారతీయ సినిమాకే ప్రతిమలాంటి వారు అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. ఈమేరకు సంతాప ప్రకటనను ఆయన కుటుంబానికి పంపారు. సంతాపం తెలిపినవారిలో గాయని లతామంగేష్కర, అమితాబ్‌బచ్చన్‌, నటి శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చిరంజీవి తదితరులు ఉన్నారు. యష్ మరణం తీరని లోటుగా పేర్కొన్నారు.

  సోమవారం మూడు గంటలకు దక్షిణముంబయిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంధేరీలోని యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ స్టూడియోలో ప్రజల సందర్శనకు ఏర్పాట్లు చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయనకు భార్య పమేలా, ఇద్దరు కుమారులున్నారు. తనయుల్లో ఆదిత్యచోప్రా సినీ దర్శకులుకాగా, ఉదయ్‌చోప్రా నటుడు, నిర్మాత. ఇటీవల నిర్వహించిన అమితాబ్‌ బచ్చన్‌ 70వ జన్మదిన వేడుకలకు యశ్‌ భార్యతోపాటు హాజరయ్యారు.

  1932 సెప్టెంబర్ 27న జన్మించిన యష్ చోప్రా.. దూల్ కా పూల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై జబ్ తక్ హై జాన్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. దాగ్ చిత్రంతో 1973లో యష్ రాజ్ చిత్ర సంస్థను నెలకొల్పారు. ఇప్పటివరకు మొత్తం 50 చిత్రాల వరకు దర్శకత్వం, నిర్మాణ రంగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. యష్ చోప్రా తన సిని జీవితంలో 50 పైగా చిత్రాలను నిర్మించారు. అందులో కభీ కభీ, కాల పత్తర్, సిల్ సిలా, చాందినీ, లమ్హే, డర్, యే దిల్లగి, దిల్ తో పాగల్ హై, హమ్ తుమ్, ధూమ్, బంటి ఔర్ బబ్లీ, సలాం నమస్తే, ఫనా చిత్రాలు హిట్ గా నిలిచాయి.

  1956 లో ఏక్ హీ రాస్తా చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడం ద్వారా చిత్ర రంగంలోకి ప్రవేశించిన యష్.. ధూల్ కా పూల్ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. నిర్మాతగా, సినీ రచయితగా పలు పాత్రలను విజయవంతంగా నిర్వర్తించారు. యష్ చోప్రా అందించిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2001 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, 2005 పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇంకా బాఫ్టా అవార్డులతోపాటు ఆయన నిర్మించిన చిత్రాలకు పలు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. యష్ చోప్రా జబ్ తక్ హై జాన్ చిత్రంతో కలిపి మొత్తం 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతికి 'ధట్స్ తెలుగు' సంతాపం తెలియచేస్తోంది.

  English summary
  Legendary film director, screenwriter and film producer Yash Chopra is dead. Chopra, 80, had been admitted to Lilavati hospital in Bandra on October 13 after being diagnosed with dengue, according to TV reports. Known for making some of the best love stories and action dramas, the veteran had been busy shooting for his last directorial project — Jab Tak Hai Jaan. In his over five decade old career, Chopra has made several hits like 'Deewar', 'Trishul', 'Chandni', 'Silsila', 'Veer Zaara' and others. Mr Chopra is survived by his wife Pamela and two sons Aditya and Uday.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more