»   » సల్మాన్ ‘బజ్రంగి’: హిందువులను కించపరిచేలా ఉందట!

సల్మాన్ ‘బజ్రంగి’: హిందువులను కించపరిచేలా ఉందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘బజ్రంగి భాయిజాన్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈద్ పండగ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా పేరును మార్చాలని, ఆ సినిమాకు ఆ పేరు పెట్టడం హిందువులను కించపరిచినట్లవుతుందని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆందోళన చేపట్టాయి. పేరు మార్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని, సినిమాను నడవనీయమని హెచ్చరించారు.

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంజాన్ కానుకగా జులై 17న సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

VHP, Bajrang Dal Against Salman Khan's 'Bajrangi Bhaijaan' title

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్లో కరీనా కపూర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇందులో ఆమె రాశిక పాత్రలో నటిస్తోంది. మరో పాత్రధారి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో పాకిస్థాన్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి.

English summary
A group of right-wing Vishwa Hindu Parishad (VHP) and Bajrang Dal protested against Salman Khan‘s upcoming Eid release “Bajrangi Bhaijaan”. Raising slogans, the group demanded that the film’s title be changed as it hurts Hindu sentiments.
Please Wait while comments are loading...